Emta siggulu vadevu imdugu neevu

ఎంత సిగ్గులు వడేవు ఇందుకు నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత సిగ్గులు వడేవు ఇందుకు నీవు
వంతఁ బొరల కెప్పటివలె నుండవయ్యా

(॥ఎంత॥)
యింటికి వచ్చి యాపె నీయేదుట నిలుచుండఁగా
అంటెఁ గాక మోహము నీ వాసపడేవా
వొంటినుండి సారె నీకు వూడిగాలు సేయఁగాను
నంటు సేసెఁ గాక నీమనసూ నటువంటిదా

(॥ఎంత॥)
మలయుచు నీతో నాపె మాటలెల్లా నాడఁగాను
కలసెఁ గాక పొత్తు గలదా తొల్లి
చలపట్టి పైకొని సరసము నెరపఁగా
పులకించెఁ గాక వట్టి పొందు సేసేవాఁడవా

(॥ఇంత॥)
పానుపై నిన్ను నాపె పచ్చిగాఁ గాఁగిలించఁగా
మేను చెమరించెఁగాక మించి కూడేవా
అనుక శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి
కానుకాపె యియ్యఁగానేకాక చేత నంటేవా

(||pallavi||)
ĕṁta siggulu vaḍevu iṁdugu nīvu
vaṁtam̐ bŏrala kĕppaḍivalĕ nuṁḍavayyā

(||ĕṁta||)
yiṁṭigi vachchi yābĕ nīyeduḍa nilusuṁḍam̐gā
aṁṭĕm̐ gāga mohamu nī vāsabaḍevā
vŏṁṭinuṁḍi sārĕ nīgu vūḍigālu seyam̐gānu
naṁṭu sesĕm̐ gāga nīmanasū naḍuvaṁṭidā

(||ĕṁta||)
malayusu nīdo nābĕ māḍalĕllā nāḍam̐gānu
kalasĕm̐ gāga pŏttu galadā tŏlli
salabaṭṭi paigŏni sarasamu nĕrabam̐gā
pulagiṁchĕm̐ gāga vaṭṭi pŏṁdu sesevām̐ḍavā

(||iṁta||)
pānubai ninnu nābĕ pachchigām̐ gām̐giliṁcham̐gā
menu sĕmariṁchĕm̐gāga miṁchi kūḍevā
anuga śhrīveṁkaḍeśha aṁtalo nannelidivi
kānugābĕ yiyyam̐gānegāga seda naṁṭevā