ఎంత సిగ్గులు వడేవే యిందరు నున్నారంటా
(॥పల్లవి॥)
ఎంత సిగ్గులు వడేవే యిందరు నున్నారంటా
వింతదానవా నీవు విభునికిని
(॥పల్లవి॥)
ముసిముసినవ్వు లేలే ముక్కుమీఁది వే లేలే
కొసరి యాతఁడు నిన్నుఁగొంగువట్టఁగా
కసిగాటుమాఁట లేలే కడునొడ్డించుకో నేలే
పొసఁగఁ జెక్కులు నొక్కి బుజ్జగించఁగాను
(॥ఎంత॥)
చిమ్ముఁజూపు లిపుడేలే శిరసు వంచఁగనేలే
సమ్మతించి పతి సరసములాడఁగా
కమ్ముక పెనఁగనేలే కావరపువేసా లేలే
కమ్మరఁగమ్మర నిన్నుఁగాఁగిలించఁగాను
(॥ఎంత॥)
వేవేలు మొక్కు లివేలే వేడుకలు దాఁచనేలే
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జేరి కూడఁగా
చేవమీరి చొక్కనేలే చిమ్మిరేఁగ నింతయేలే
మోవితేనె లిచ్చి నీపై మోహము చల్లఁగను
(||pallavi||)
ĕṁta siggulu vaḍeve yiṁdaru nunnāraṁṭā
viṁtadānavā nīvu vibhunigini
(||pallavi||)
musimusinavvu lele mukkumīm̐di ve lele
kŏsari yādam̐ḍu ninnum̐gŏṁguvaṭṭam̐gā
kasigāḍumām̐ṭa lele kaḍunŏḍḍiṁchugo nele
pŏsam̐gam̐ jĕkkulu nŏkki bujjagiṁcham̐gānu
(||ĕṁta||)
simmum̐jūbu libuḍele śhirasu vaṁcham̐ganele
sammadiṁchi padi sarasamulāḍam̐gā
kammuga pĕnam̐ganele kāvarabuvesā lele
kammaram̐gammara ninnum̐gām̐giliṁcham̐gānu
(||ĕṁta||)
vevelu mŏkku livele veḍugalu dām̐sanele
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jeri kūḍam̐gā
sevamīri sŏkkanele simmirem̐ga niṁtayele
movidenĕ lichchi nībai mohamu sallam̐ganu