Emta siggarigattevu yeme neevu

ఎంత సిగ్గరికత్తెవు యేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత సిగ్గరికత్తెవు యేమే నీవు
వింత వింత వాసులేల వెదచల్లేవే

(॥ఎంత॥)
వలచిన రమణుఁడు వావి నీకుఁ జెప్పితేను
కలికి కన్నులనేల గద్దించేవే
కలువపూవుల వేసి కతలు ని న్నడిగితే
సెలవుల నవ్వులేల చిందేవే

(॥ఎంత॥)
చవులుగా మోవి చూపి సన్నలు నీకుఁ జేసితే
జవళి బొమ్మలనేల జంకించేనే
తివురుచు నీ చన్నులది క్కతఁడు చూచితేను
రవళి సణఁగులేల రాలిచేవే

(॥ఎంత॥)
చుట్టరికమున నిన్ను సోఁకఁ గాఁగిలించుకొంటే
వొట్టుగా చేతులనేల వొడ్డుకొనేవే
యిట్టె శ్రీవేంకటేశుఁ డేలె నలమేల్మంగవు
గుట్టున నేరుపులేల కుమ్మరించేవే

(||pallavi||)
ĕṁta siggarigattĕvu yeme nīvu
viṁta viṁta vāsulela vĕdasalleve

(||ĕṁta||)
valasina ramaṇum̐ḍu vāvi nīgum̐ jĕppidenu
kaligi kannulanela gaddiṁcheve
kaluvabūvula vesi kadalu ni nnaḍigide
sĕlavula navvulela siṁdeve

(||ĕṁta||)
savulugā movi sūbi sannalu nīgum̐ jeside
javaḽi bŏmmalanela jaṁkiṁchene
tivurusu nī sannuladi kkadam̐ḍu sūsidenu
ravaḽi saṇam̐gulela rāliseve

(||ĕṁta||)
suṭṭarigamuna ninnu som̐kam̐ gām̐giliṁchugŏṁṭe
vŏṭṭugā sedulanela vŏḍḍugŏneve
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nalamelmaṁgavu
guṭṭuna nerubulela kummariṁcheve