Emta sesidivo aabe nemidamgaani nammado

ఎంత సేసితివో ఆపె నేమిటఁగాని నమ్మదో
Language

(॥పల్లవి॥)
ఎంత సేసితివో ఆపె నేమిటఁగాని నమ్మదో
పంతములు మెరసె నేపనికో కాని

(॥ఎంత॥)
పలుమారు వాలుకరెప్పలు వంచి చూచీ నిన్ను
యెలమిఁ గొసరె నాపె యేఁటికోకాని
సెలవుల నవ్వుదేర చేత రొమ్ము దట్టుకొంటా
మలయుచు శిరసూఁచె మరియేలోకాని

(॥ఎంత॥)
పెదవులు గదలఁగ పేరుకొని గొణఁగుతా
యెదురుగా నిలుచుండె నేఁటికో కాని
మదముదొలఁక నీతో మాటకు మాటాడి నిన్ను
నదనఁ జెయివట్టి తీసె నదేఁటికోకాని

(॥ఎంత॥)
గుట్టుతోడఁ బరతెంచి కుచములు గదలఁగ
ఇట్టె నీవద్దఁ గూచుండె నేఁటికోకాని
జట్టిగా శ్రీవేంకటేశ సమరతినిఁ జొక్కించి
నెట్టుకొని నిన్ను మెచ్చె నెపమేదోకాని

(||pallavi||)
ĕṁta sesidivo ābĕ nemiḍam̐gāni nammado
paṁtamulu mĕrasĕ nebanigo kāni

(||ĕṁta||)
palumāru vālugarĕppalu vaṁchi sūsī ninnu
yĕlamim̐ gŏsarĕ nābĕ yem̐ṭigogāni
sĕlavula navvudera seda rŏmmu daṭṭugŏṁṭā
malayusu śhirasūm̐sĕ mariyelogāni

(||ĕṁta||)
pĕdavulu gadalam̐ga perugŏni gŏṇam̐gudā
yĕdurugā nilusuṁḍĕ nem̐ṭigo kāni
madamudŏlam̐ka nīdo māḍagu māḍāḍi ninnu
nadanam̐ jĕyivaṭṭi tīsĕ nadem̐ṭigogāni

(||ĕṁta||)
guṭṭudoḍam̐ baradĕṁchi kusamulu gadalam̐ga
iṭṭĕ nīvaddam̐ gūsuṁḍĕ nem̐ṭigogāni
jaṭṭigā śhrīveṁkaḍeśha samaradinim̐ jŏkkiṁchi
nĕṭṭugŏni ninnu mĕchchĕ nĕbamedogāni