Emta sese vimdugumgaa neppadivaarame kaamaa

ఎంత సేసే విందుకుఁగా నెప్పటివారమే కామా
Language

(॥పల్లవి॥)
ఎంత సేసే విందుకుఁగా నెప్పటివారమే కామా
వంతు వరుసకు రాఁగా వద్దంటినా

(॥॥)
మాటల దొంతులు వెట్టి మచ్చికలు చుట్టి పెట్టి
కూటమి కెసరువెట్టి కొంగువట్టేవు
యేఁటి కింతేసి సేసేవు ఇంటికి విచ్చేసి నీవు
వాఁటానఁ గాఁగిలించఁగా వద్దంటినా

(॥॥)
వలపులఁ బంట వండి తలఁపులో గూడువండి
నిలువునూరుఁ బండి నెట్టుకుండేవు
బలిమేల సేసేవు పానుపు మీఁదికి వచ్చి
వలసినట్టు సేయఁగా వద్దంటినా

(॥॥)
చూపులనే విందుచెప్పి సొంపులు పైపైఁ గప్పి
తీపుమోవితేనె గుప్పి తిప్పేవు చేయి
రాపుగ శ్రీవేంకటేశ రవ్వలేల సేసేవు
వైపుగానే కూడితివి వద్దంటినా

(||pallavi||)
ĕṁta sese viṁdugum̐gā nĕppaḍivārame kāmā
vaṁtu varusagu rām̐gā vaddaṁṭinā

(||||)
māḍala dŏṁtulu vĕṭṭi machchigalu suṭṭi pĕṭṭi
kūḍami kĕsaruvĕṭṭi kŏṁguvaṭṭevu
yem̐ṭi kiṁtesi sesevu iṁṭigi vichchesi nīvu
vām̐ṭānam̐ gām̐giliṁcham̐gā vaddaṁṭinā

(||||)
valabulam̐ baṁṭa vaṁḍi talam̐pulo gūḍuvaṁḍi
niluvunūrum̐ baṁḍi nĕṭṭuguṁḍevu
balimela sesevu pānubu mīm̐digi vachchi
valasinaṭṭu seyam̐gā vaddaṁṭinā

(||||)
sūbulane viṁdusĕppi sŏṁpulu paibaim̐ gappi
tībumovidenĕ guppi tippevu seyi
rābuga śhrīveṁkaḍeśha ravvalela sesevu
vaibugāne kūḍidivi vaddaṁṭinā