Emta sese vimdugugaa yela lomgevu

ఎంత సేసే విందుకుగా యేల లోఁగేవు
Language

(॥పల్లవి॥)
ఎంత సేసే విందుకుగా యేల లోఁగేవు
వింతవారి వలె నిన్ను వేసరించేనా

(॥ఎంత॥)
పూసగుచ్చినట్టు నిన్నుఁ బొగడేటి దానను
రాసికెక్క నిందరిలో రవ్వసేసేనా
సేస వెట్టి ఇట్టె నీపైఁ జేయి చాఁచే దానను
వీసమంత పనికిఁగా వెంగెమాడేనా

(॥ఎంత॥)
నగుతానే నే నీకు ననుపైనదానను
తగవులఁబెట్టి నేఁడు తమకించేనా
మొగము చూచి సారె మొక్కేటిదానను
పగటుఁదనాలు సేసి పంతము చూపేనా

(॥ఎంత॥)
కొసరి కొసరి నిన్నుఁ గూడినట్టిదానను
కుసి గుంపు నీవలపు గోరసేసేవా
యెసగ శ్రీ వేంకటేశ యియ్యకొన్నదానను
సుసరి వైతివి నీపైఁ జొప్పులెత్తేనా

(||pallavi||)
ĕṁta sese viṁdugugā yela lom̐gevu
viṁtavāri valĕ ninnu vesariṁchenā

(||ĕṁta||)
pūsaguchchinaṭṭu ninnum̐ bŏgaḍeḍi dānanu
rāsigĕkka niṁdarilo ravvasesenā
sesa vĕṭṭi iṭṭĕ nībaim̐ jeyi sām̐se dānanu
vīsamaṁta panigim̐gā vĕṁgĕmāḍenā

(||ĕṁta||)
nagudāne ne nīgu nanubainadānanu
tagavulam̐bĕṭṭi nem̐ḍu tamagiṁchenā
mŏgamu sūsi sārĕ mŏkkeḍidānanu
pagaḍum̐danālu sesi paṁtamu sūbenā

(||ĕṁta||)
kŏsari kŏsari ninnum̐ gūḍinaṭṭidānanu
kusi guṁpu nīvalabu gorasesevā
yĕsaga śhrī veṁkaḍeśha yiyyagŏnnadānanu
susari vaidivi nībaim̐ jŏppulĕttenā