Emta seppudunu moha meedanimeemda

ఎంత చెప్పుదును మోహ మీతనిమీఁద
Language

(॥పల్లవి॥)
ఎంత చెప్పుదును మోహ మీతనిమీఁద
చింతించఁజాల నే కక్కసించినట్టౌననుచు

(॥ఎంత॥)
కడుసింగారపుమేను కసుగందునోయని
జడిసి తప్పకచూడఁజాలనే నేను
యెడయక తనసుద్దు లెవ్వతె వినీనోయని
నుడుగఁగఁ జాలనే నోరెత్తి నేను

(॥ఎంత॥)
నెమ్మది నిండుమనసు నీరై కరఁగునోయని
సమ్మతిఁ జన్నుల నొత్తఁజాలనే నేను
కమ్మటి వలలఁబెట్టి కదిమినట్టౌనోయని
చిమ్ముచు నవ్వఁజాలనే సెలవుల నేను

(॥ఎంత॥)
చినుకురతిఁ జెమట చిమ్మిరేఁగునోయని
పెనఁగఁగఁజాలనే బెట్టుగా నేను
యెనసె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
తనివొందించఁజాలనే తమితోడ నేను

(||pallavi||)
ĕṁta sĕppudunu moha mīdanimīm̐da
siṁtiṁcham̐jāla ne kakkasiṁchinaṭṭaunanusu

(||ĕṁta||)
kaḍusiṁgārabumenu kasugaṁdunoyani
jaḍisi tappagasūḍam̐jālane nenu
yĕḍayaga tanasuddu lĕvvadĕ vinīnoyani
nuḍugam̐gam̐ jālane norĕtti nenu

(||ĕṁta||)
nĕmmadi niṁḍumanasu nīrai karam̐gunoyani
sammadim̐ jannula nŏttam̐jālane nenu
kammaḍi valalam̐bĕṭṭi kadiminaṭṭaunoyani
simmusu navvam̐jālane sĕlavula nenu

(||ĕṁta||)
sinuguradim̐ jĕmaḍa simmirem̐gunoyani
pĕnam̐gam̐gam̐jālane bĕṭṭugā nenu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
tanivŏṁdiṁcham̐jālane tamidoḍa nenu