ఎంత చెప్పినా వినవు యేలే నీకు
(॥పల్లవి॥)
ఎంత చెప్పినా వినవు యేలే నీకు
మంతనాన రమణుఁడు మనసిచ్చీ నీకును
(॥ఎంత॥)
నిండిన కళలమోము నివ్వెర పరచకువే
కొండవంటిపతి నిన్నుఁ గొంగువట్టఁగా
యెండకంట నీడకంట నేల చూచేవే యాతని
పండువంటిమోవి చూచి పాలార్చీ నిన్నును
(॥ఎంత॥)
బంగారువంటిమేను పయ్యద మూసుకోకువే
సింగారపురమణుఁడు చేయిచాఁచఁగా
చెంగి పచ్చిమాటలు వెచ్చినమాటా నాడకువే
అంగమంటి చెక్కునొక్కి యాదరించీ నిన్నును
(॥ఎంత॥)
తుమ్మిదవంటిబొమ్మలు తోడ ముడివెట్టకువే
నెమ్మి శ్రీవేంకటపతి నీతో నవ్వఁగా
సమ్మతించి చనవిచ్చి సమరతి వీఁగకువే
కమ్మరఁ గమ్మరఁ గూడి కరగించె నితఁడు
(||pallavi||)
ĕṁta sĕppinā vinavu yele nīgu
maṁtanāna ramaṇum̐ḍu manasichchī nīgunu
(||ĕṁta||)
niṁḍina kaḽalamomu nivvĕra parasaguve
kŏṁḍavaṁṭibadi ninnum̐ gŏṁguvaṭṭam̐gā
yĕṁḍagaṁṭa nīḍagaṁṭa nela sūseve yādani
paṁḍuvaṁṭimovi sūsi pālārsī ninnunu
(||ĕṁta||)
baṁgāruvaṁṭimenu payyada mūsugoguve
siṁgāraburamaṇum̐ḍu seyisām̐sam̐gā
sĕṁgi pachchimāḍalu vĕchchinamāḍā nāḍaguve
aṁgamaṁṭi sĕkkunŏkki yādariṁchī ninnunu
(||ĕṁta||)
tummidavaṁṭibŏmmalu toḍa muḍivĕṭṭaguve
nĕmmi śhrīveṁkaḍabadi nīdo navvam̐gā
sammadiṁchi sanavichchi samaradi vīm̐gaguve
kammaram̐ gammaram̐ gūḍi karagiṁchĕ nidam̐ḍu