ఎంత చెప్పినా నెఱఁగవు తొలుతనె
(॥పల్లవి॥)
ఎంత చెప్పినా నెఱఁగవు తొలుతనె
శాంతం బయితే సరి గలదా
(॥ఎంత॥)
కడవఁ బలకకువె కమ్మర నాతని
బడిఁ బ్రియములు చెప్పకువె మరి
అడరి చేదు దిని అటు దీపు దినఁగ
సడి, యందువలన చవి యేది
(॥ఎంత॥)
అలిగి రాకుండితే నాతని యింటికిఁ
బిలువఁ బోకువే పెనగొనుచు
పొలసి వేఁడిలోఁ బొరలి యీడుగా
చలువలఁ బొరలిన చవులవునా
(॥ఎంత॥)
తప్పక చూడకు తగిలి మొక్కకువె
యిప్పుడు శ్రీవేంకటేశునకు
వొప్పుగఁ గూడితి యువిద లతని కిఁక
చప్పనె కా కిటు చవి వుట్టీనా
(||pallavi||)
ĕṁta sĕppinā nĕṟam̐gavu tŏludanĕ
śhāṁtaṁ bayide sari galadā
(||ĕṁta||)
kaḍavam̐ balagaguvĕ kammara nādani
baḍim̐ briyamulu sĕppaguvĕ mari
aḍari sedu dini aḍu dību dinam̐ga
saḍi, yaṁduvalana savi yedi
(||ĕṁta||)
aligi rāguṁḍide nādani yiṁṭigim̐
biluvam̐ boguve pĕnagŏnusu
pŏlasi vem̐ḍilom̐ bŏrali yīḍugā
saluvalam̐ bŏralina savulavunā
(||ĕṁta||)
tappaga sūḍagu tagili mŏkkaguvĕ
yippuḍu śhrīveṁkaḍeśhunagu
vŏppugam̐ gūḍidi yuvida ladani kim̐ka
sappanĕ kā kiḍu savi vuṭṭīnā