Emta seppinaa maanamdu yeggulu vatteem daanu

ఎంత చెప్పినా మానఁడు యెగ్గులు వట్టీఁ దాను
Language

(॥పల్లవి॥)
ఎంత చెప్పినా మానఁడు యెగ్గులు వట్టీఁ దాను
వింతలు సేయక మీరు విన్నవించరే

(॥ఎంత॥)
కొప్పు వట్టి తియ్యఁగాను కొసరి తిట్టఁగరాదా
అప్పటి నవ్వఁగఁ జేత నంటరాదా
కుప్పించి పెనఁగఁగాను కొనగోరు మోపరాదా
చెప్పరే యీతగవులు చెలులాల మాకు

(॥ఎంత॥)
వొక్కటొక్కటే యాడఁగ వొట్టు వెట్టఁగరాదా
తొక్కరాఁగా మారుకొని దొబ్బరాదా
వెక్కసాన నడవఁగా విరుల వేయఁగరాదా
నిక్క మేది కల్ల యేది నెలఁతలు చెప్పరే

(॥ఎంత॥)
గుంపించి వొరయరాఁగా కుచముల నొత్తరాదా
సొంపున నెమ్మె సేయఁగా సొలయరాదా
యింపుల శ్రీ వేంకటేశుఁడింత సేసి నన్నుఁగూడె
జంపుసేయక చెప్పరే సతులు మాకిపుడు

(||pallavi||)
ĕṁta sĕppinā mānam̐ḍu yĕggulu vaṭṭīm̐ dānu
viṁtalu seyaga mīru vinnaviṁchare

(||ĕṁta||)
kŏppu vaṭṭi tiyyam̐gānu kŏsari tiṭṭam̐garādā
appaḍi navvam̐gam̐ jeda naṁṭarādā
kuppiṁchi pĕnam̐gam̐gānu kŏnagoru mobarādā
sĕppare yīdagavulu sĕlulāla māgu

(||ĕṁta||)
vŏkkaḍŏkkaḍe yāḍam̐ga vŏṭṭu vĕṭṭam̐garādā
tŏkkarām̐gā mārugŏni dŏbbarādā
vĕkkasāna naḍavam̐gā virula veyam̐garādā
nikka medi kalla yedi nĕlam̐talu sĕppare

(||ĕṁta||)
guṁpiṁchi vŏrayarām̐gā kusamula nŏttarādā
sŏṁpuna nĕmmĕ seyam̐gā sŏlayarādā
yiṁpula śhrī veṁkaḍeśhum̐ḍiṁta sesi nannum̐gūḍĕ
jaṁpuseyaga sĕppare sadulu māgibuḍu