Emta seppinaa maana vimdaamkaa nemu

ఎంత చెప్పినా మాన విందాఁకా నేము
Language

(॥పల్లవి॥)
ఎంత చెప్పినా మాన విందాఁకా నేము
అంతలోఁ బెద్దరికములాయనా నేఁడు

(॥॥)
చెక్కునొక్కె సేసవెట్టె చెలియ నీకాలు దొక్కె
తెక్కుల నీజగడాలు దీరెనా నేఁడు
చుక్కలు మోవిపై నాఁటె చొక్కపుగుబ్బలు మోపె
వక్కణించి నీపంతము వచ్చెనా నేఁడు

(॥॥)
కన్నువేసే మాటలాడె కమ్మనినవ్వులు నవ్వె
చిన్ననాఁడే, నీచలము చెల్లెనా నేఁడు
మున్ను నీకుఁ జేత మొక్కె ముచ్చటలన్నియుఁ జెప్పె
పన్నిననీలోనిచింత పానెనా నేఁడు

(॥॥)
చేయివేసె చెట్టవట్టె సిగ్గు నీ కొప్పగించె
చాయల నీ కిదిమైనా సమ్మతా నేఁడు
యీయెడ శ్రీవేంకటేశ ఇంతి దానే నిన్నుఁ గూడె
మాయపునీమేనికాఁక మానెనా నేఁడు

(||pallavi||)
ĕṁta sĕppinā māna viṁdām̐kā nemu
aṁtalom̐ bĕddarigamulāyanā nem̐ḍu

(||||)
sĕkkunŏkkĕ sesavĕṭṭĕ sĕliya nīgālu dŏkkĕ
tĕkkula nījagaḍālu dīrĕnā nem̐ḍu
sukkalu movibai nām̐ṭĕ sŏkkabugubbalu mobĕ
vakkaṇiṁchi nībaṁtamu vachchĕnā nem̐ḍu

(||||)
kannuvese māḍalāḍĕ kammaninavvulu navvĕ
sinnanām̐ḍe, nīsalamu sĕllĕnā nem̐ḍu
munnu nīgum̐ jeda mŏkkĕ muchchaḍalanniyum̐ jĕppĕ
panninanīlonisiṁta pānĕnā nem̐ḍu

(||||)
seyivesĕ sĕṭṭavaṭṭĕ siggu nī kŏppagiṁchĕ
sāyala nī kidimainā sammadā nem̐ḍu
yīyĕḍa śhrīveṁkaḍeśha iṁti dāne ninnum̐ gūḍĕ
māyabunīmenigām̐ka mānĕnā nem̐ḍu