ఎంత చెప్పినా మాన దిందాఁక నే మెల్ల
(॥పల్లవి॥)
ఎంత చెప్పినా మాన దిందాఁక నే మెల్ల
పంతపు దమ కోపాలు పచరించఁ బట్టెను
(॥ఎంత॥)
ఆలవట్టము గాలికి అంగన పయ్యద జారి
పాలిండ్లు గాన రాఁగాఁ బతిఁ గాఁగిలించెను
మేలు మేలు దీని నేఁడు మెచ్చవలె నిందుకే
వోలి నూరకున్నవారి నొక్కటిగాఁ జేసెఁగా
(॥ఎంత॥)
కప్పురము నోటి కీఁగా కాంత చలిగొని పతి
కప్పినపచ్చడమే కప్పుకొనెను
కుప్పలుగా దీనినె కొనియాడవలె నేఁడు
తప్పక చూడనివారిఁ దగులుగాఁ జేసెను
(॥ఎంత॥)
పన్నీరు చల్లఁగాను పడఁతిమై పులకించి
తన్నుఁ దానె సిగ్గుపడి తల వంచి నవ్వెను
అన్నిటా మొక్కఁగ వలె నందుకే నేఁడు దీనికి
యెన్నఁగ శ్రీవెంకటేశు నింతినిఁ గూడించెను
(||pallavi||)
ĕṁta sĕppinā māna diṁdām̐ka ne mĕlla
paṁtabu dama kobālu pasariṁcham̐ baṭṭĕnu
(||ĕṁta||)
ālavaṭṭamu gāligi aṁgana payyada jāri
pāliṁḍlu gāna rām̐gām̐ badim̐ gām̐giliṁchĕnu
melu melu dīni nem̐ḍu mĕchchavalĕ niṁduge
voli nūragunnavāri nŏkkaḍigām̐ jesĕm̐gā
(||ĕṁta||)
kappuramu noḍi kīm̐gā kāṁta saligŏni padi
kappinabachchaḍame kappugŏnĕnu
kuppalugā dīninĕ kŏniyāḍavalĕ nem̐ḍu
tappaga sūḍanivārim̐ dagulugām̐ jesĕnu
(||ĕṁta||)
pannīru sallam̐gānu paḍam̐timai pulagiṁchi
tannum̐ dānĕ siggubaḍi tala vaṁchi navvĕnu
anniḍā mŏkkam̐ga valĕ naṁduge nem̐ḍu dīnigi
yĕnnam̐ga śhrīvĕṁkaḍeśhu niṁtinim̐ gūḍiṁchĕnu