Emta sellubadi neegu yevva richchi rori neegu

ఎంత చెల్లుబడి నీకు యెవ్వ రిచ్చి రోరి నీకు
Language

(॥పల్లవి॥)
ఎంత చెల్లుబడి నీకు యెవ్వ రిచ్చి రోరి నీకు
చెంత దొరతనము చెప్పి చూపేవా

(॥ఎంత॥)
మౌనముతో నుండఁగాను మాఁట లాడించ వచ్చేవు
నేనాఁటదాన నైతే నేమము లేదా
పూని జలక మాడఁగ బొంచి యాడకు వచ్చేవు
మేనబావ వైనంతనే మేర మీరేవా

(॥ఎంత॥)
మోము వంచుకుండఁగానెమొక్కులు మొక్క వచ్చేవు
బాముతో జవ్వను లైతే బలవు లేదా
నోము నోమఁగానె చెక్కు నొక్కి రతికిఁ దీసేవు
యేమిరా నీపొరు గైతే నింత సేసేవా

(॥ఎంత॥)
మంచముపై నుండఁగానె మరి కాఁగిలించేవు
అంచె నీవొద్దనుంటే అడ్డము లేదా
యెంచఁగానె శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
కంచము పొత్తున నుంటే కాఁక రేఁచేవా

(||pallavi||)
ĕṁta sĕllubaḍi nīgu yĕvva richchi rori nīgu
sĕṁta dŏradanamu sĕppi sūbevā

(||ĕṁta||)
maunamudo nuṁḍam̐gānu mām̐ṭa lāḍiṁcha vachchevu
nenām̐ṭadāna naide nemamu ledā
pūni jalaga māḍam̐ga bŏṁchi yāḍagu vachchevu
menabāva vainaṁtane mera mīrevā

(||ĕṁta||)
momu vaṁchuguṁḍam̐gānĕmŏkkulu mŏkka vachchevu
bāmudo javvanu laide balavu ledā
nomu nomam̐gānĕ sĕkku nŏkki radigim̐ dīsevu
yemirā nībŏru gaide niṁta sesevā

(||ĕṁta||)
maṁchamubai nuṁḍam̐gānĕ mari kām̐giliṁchevu
aṁchĕ nīvŏddanuṁṭe aḍḍamu ledā
yĕṁcham̐gānĕ śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
kaṁchamu pŏttuna nuṁṭe kām̐ka rem̐sevā