ఎంత చనవిచ్చితివో యీపె నీపై వెదచల్లీ
(॥పల్లవి॥)
ఎంత చనవిచ్చితివో యీపె నీపై వెదచల్లీ
కొంతపుఁ జూపుల చూడికుడుత నాచారు
(॥ఎంత॥)
ముప్పిరిఁమనసార ముడిచినదండలు నీ
కొప్పున ముడిచీఁ జూడికుడుతనాచారు
తప్పులేక నిన్నుఁ జనుఁదామర మొగ్గలు మోవ
గుప్పీ నిన్నిదివో చూడికుడుతనాచారు
(॥ఎంత॥)
చేరఁదీసి నీమీఁద చెమటపయ్యద గప్పి
కూరిమి గొసరీఁ జూడికుడుతనాచారు
చేరి వేఁడుకొని వేరుసేయకుమవి నీచెక్కు
గోరనొత్తీ నిదె చూడికుడుతనాచారు
(॥ఎంత॥)
అంకెల శ్రీవేంకటేశ అదె నీమైఁ దనమేని
కుంకుమ వూసీఁ జూడికుడుతనాచారు
అంకపురతులఁగూడి అలమేలుమంగె తానై
కొంకుదేర్చె నిన్నుఁ జూడికుడుతనాచారు
(||pallavi||)
ĕṁta sanavichchidivo yībĕ nībai vĕdasallī
kŏṁtabum̐ jūbula sūḍiguḍuda nāsāru
(||ĕṁta||)
muppirim̐manasāra muḍisinadaṁḍalu nī
kŏppuna muḍisīm̐ jūḍiguḍudanāsāru
tappulega ninnum̐ janum̐dāmara mŏggalu mova
guppī ninnidivo sūḍiguḍudanāsāru
(||ĕṁta||)
seram̐dīsi nīmīm̐da sĕmaḍabayyada gappi
kūrimi gŏsarīm̐ jūḍiguḍudanāsāru
seri vem̐ḍugŏni veruseyagumavi nīsĕkku
goranŏttī nidĕ sūḍiguḍudanāsāru
(||ĕṁta||)
aṁkĕla śhrīveṁkaḍeśha adĕ nīmaim̐ danameni
kuṁkuma vūsīm̐ jūḍiguḍudanāsāru
aṁkaburadulam̐gūḍi alamelumaṁgĕ tānai
kŏṁkudersĕ ninnum̐ jūḍiguḍudanāsāru