Emta sanavaro kaani yevvaderaa

ఎంత చనవరో కాని యెవ్వతెరా
Language

(॥పల్లవి॥)
ఎంత చనవరో కాని యెవ్వతెరా
యింత గయ్యాళి చేఁతల దెవ్వతెరా

(॥ఎంత॥)
వల్లెవాటుఁ బయ్యదతో వచ్చి నన్ను సన్నసేసీ
యెల్లవారుఁ జూడఁగా నెవ్వతెరా
తొల్లి నీకు పొందు గద్దో తొడిఁబడఁ బానుపుపై
యిల్లు చొచ్చి పవ్వళించె నెవ్వతెరా

(॥ఎంత॥)
వాడుఁ జూపుల కన్నుల వలపులు చల్లి నీతో
యీడనే నవ్వులు నవ్వీ నెవ్వతెరా
ఆడరానిమాట లాడి ఆయాలు దాఁక సంగడి
వీడుగాఁ గూచుండ వచ్చీ నెవ్వతెరా

(॥ఎంత॥)
కప్పురము మోవి నిచ్చి కాఁకలతోఁ దమకించి
యిప్పుడె యాఁకారీని నెవ్వతెరా
ముప్పిరి శ్రీవేంకటేశ ముందర నన్నుఁ గూడితి
వెప్పుడాకె నిన్నుఁ గూడె నెవ్వతెరా

(||pallavi||)
ĕṁta sanavaro kāni yĕvvadĕrā
yiṁta gayyāḽi sem̐tala dĕvvadĕrā

(||ĕṁta||)
vallĕvāḍum̐ bayyadado vachchi nannu sannasesī
yĕllavārum̐ jūḍam̐gā nĕvvadĕrā
tŏlli nīgu pŏṁdu gaddo tŏḍim̐baḍam̐ bānububai
yillu sŏchchi pavvaḽiṁchĕ nĕvvadĕrā

(||ĕṁta||)
vāḍum̐ jūbula kannula valabulu salli nīdo
yīḍane navvulu navvī nĕvvadĕrā
āḍarānimāḍa lāḍi āyālu dām̐ka saṁgaḍi
vīḍugām̐ gūsuṁḍa vachchī nĕvvadĕrā

(||ĕṁta||)
kappuramu movi nichchi kām̐kaladom̐ damagiṁchi
yippuḍĕ yām̐kārīni nĕvvadĕrā
muppiri śhrīveṁkaḍeśha muṁdara nannum̐ gūḍidi
vĕppuḍāgĕ ninnum̐ gūḍĕ nĕvvadĕrā