ఎంత చనవరియైన యిచ్చకమే వలెఁ గాని
(॥పల్లవి॥)
ఎంత చనవరియైన యిచ్చకమే వలెఁ గాని
వింత వింత నేర్పుల వేసారుకోఁ దగదు
(॥ఎంత॥)
పతితోడ సతికినీ పంతము లాడఁ దగదు
మితిమీరి గర్వమున మించఁ దగదు
తతితోడఁ గాతరించి తప్పులు వేయఁ దగదు
చతురత సారె సారె సాదించఁగఁ దగదు
(॥ఎంత॥)
సలిగె గల దంటాను సభలో నవ్వఁ దగదు
యెలమిఁ జెనకి యలయించఁ దగదు
చలములఁ గాఁక రేఁచి చండి పోరఁ దగదు
సొలసి యానలు వెట్టించుకొనఁగ దగదు
(॥ఎంత॥)
మక్కు వెంత సేసినాను మందెమేళము దగదు
కక్కసించి ముట్టి చెనకఁగఁ దగదు
యిక్కడ శ్రీవేంకటేశుని యలమేల్మంగ గూడె
తక్కిన సతు లేఁకారఁ దమ కింకఁ దగదు
(||pallavi||)
ĕṁta sanavariyaina yichchagame valĕm̐ gāni
viṁta viṁta nerbula vesārugom̐ dagadu
(||ĕṁta||)
padidoḍa sadiginī paṁtamu lāḍam̐ dagadu
midimīri garvamuna miṁcham̐ dagadu
tadidoḍam̐ gādariṁchi tappulu veyam̐ dagadu
sadurada sārĕ sārĕ sādiṁcham̐gam̐ dagadu
(||ĕṁta||)
saligĕ gala daṁṭānu sabhalo navvam̐ dagadu
yĕlamim̐ jĕnagi yalayiṁcham̐ dagadu
salamulam̐ gām̐ka rem̐si saṁḍi poram̐ dagadu
sŏlasi yānalu vĕṭṭiṁchugŏnam̐ga dagadu
(||ĕṁta||)
makku vĕṁta sesinānu maṁdĕmeḽamu dagadu
kakkasiṁchi muṭṭi sĕnagam̐gam̐ dagadu
yikkaḍa śhrīveṁkaḍeśhuni yalamelmaṁga gūḍĕ
takkina sadu lem̐kāram̐ dama kiṁkam̐ dagadu