ఎంత సణఁగులు రాల్చే వితనిమీఁద
(॥పల్లవి॥)
ఎంత సణఁగులు రాల్చే వితనిమీఁద
చెంత నిన్నుఁ గూడి పచ్చిసేయ కేల మానునే
(॥ఎంత॥)
పలుకులఁ గొసరుతా పయ్యదను విసరుతా
చిలుకుగోరికొనలఁజిమ్ముతాను
యెలయించి రమణునికేల వొడ్డించుకొనేవే
బలునీచన్ను లాతఁడు పట్టితే నేమాయనే
(॥ఎంత॥)
బొమ్మల జంకించుతాను పొంచి యానలు వెట్టుతా
పమ్ముఁజూపుపంతాలు పచారించుతా
యెమ్మెలకు నాతనితోనేల సాములుసేసేవే
నిమ్మపంట వేసితేను నీకేమాయనే
(॥ఎంత॥)
ఆయములు దాఁకించుతా నంటిముట్టి పెనఁగుతా
చాయల సన్నల నిన్ను సాదించుతాను
పాయ కలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడు
యీయెడ నిన్నేలి చనవిచ్చితే నేమాయనే
(||pallavi||)
ĕṁta saṇam̐gulu rālse vidanimīm̐da
sĕṁta ninnum̐ gūḍi pachchiseya kela mānune
(||ĕṁta||)
palugulam̐ gŏsarudā payyadanu visarudā
silugugorigŏnalam̐jimmudānu
yĕlayiṁchi ramaṇunigela vŏḍḍiṁchugŏneve
balunīsannu lādam̐ḍu paṭṭide nemāyane
(||ĕṁta||)
bŏmmala jaṁkiṁchudānu pŏṁchi yānalu vĕṭṭudā
pammum̐jūbubaṁtālu pasāriṁchudā
yĕmmĕlagu nādanidonela sāmuluseseve
nimmabaṁṭa vesidenu nīgemāyane
(||ĕṁta||)
āyamulu dām̐kiṁchudā naṁṭimuṭṭi pĕnam̐gudā
sāyala sannala ninnu sādiṁchudānu
pāya kalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
yīyĕḍa ninneli sanavichchide nemāyane