Emta saligichchidivi yeebegu noyi

ఎంత సలిగిచ్చితివి యీపెకు నోయి
Language

(॥పల్లవి॥)
ఎంత సలిగిచ్చితివి యీపెకు నోయి
సంతతము నీకు నిది సాజమా వోయి

(॥ఎంత॥)
మిన్నక నీతో నేనుమేలములాడితినంటా
కన్నుల జంకించీ నాపె కంటివా వోయి
చన్ను మొనలను నిన్ను సారెఁ దకించితినంటా
వెన్నాడి తిట్టవచ్చీని వింటివా వోయి

(॥ఎంత॥)
వలపు నీమీఁదఁ జల్లి వద్దఁ గూచుండితినంటా
యెలమిఁ బైకొనివచ్చీ యిదేఁటిదోయి
చలివాయ నీకు మోవిచవులు చూపీనంటా
మలసి సాదించీ నేఁటిమందెమేళమోయి

(॥ఎంత॥)
పరగ నీతో నేను పక్కనఁ గూడితినంటా
వరుసవంతుకుఁ దాను వచ్చీనోయి
అరిది శ్రవేంకటేశ అలమేలుమంగ నేను
సరవిఁదా నన్నిటికి సమ్మతించెనోయి

(||pallavi||)
ĕṁta saligichchidivi yībĕgu noyi
saṁtadamu nīgu nidi sājamā voyi

(||ĕṁta||)
minnaga nīdo nenumelamulāḍidinaṁṭā
kannula jaṁkiṁchī nābĕ kaṁṭivā voyi
sannu mŏnalanu ninnu sārĕm̐ dagiṁchidinaṁṭā
vĕnnāḍi tiṭṭavachchīni viṁṭivā voyi

(||ĕṁta||)
valabu nīmīm̐dam̐ jalli vaddam̐ gūsuṁḍidinaṁṭā
yĕlamim̐ baigŏnivachchī yidem̐ṭidoyi
salivāya nīgu movisavulu sūbīnaṁṭā
malasi sādiṁchī nem̐ṭimaṁdĕmeḽamoyi

(||ĕṁta||)
paraga nīdo nenu pakkanam̐ gūḍidinaṁṭā
varusavaṁtugum̐ dānu vachchīnoyi
aridi śhraveṁkaḍeśha alamelumaṁga nenu
saravim̐dā nanniḍigi sammadiṁchĕnoyi