Emta sadivina nemi vinina tana

ఎంత చదివిన నేమి వినిన తన
Language

(॥పల్లవి॥)
ఎంత చదివిన నేమి వినిన తన-
చింతయేల మాను సిరులేల కలుగు

(॥ఎంత॥)
ఇతర దూషణములు యెడసినఁగాక
అతికాముకుఁడుగాని యప్పుడు గాక
మతిచంచలము గొంత మానినఁగాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను

(॥ఎంత॥)
పరధనములయాస పాసినఁగాక
అరిదినిందలులేనియప్పుడు గాక
విరసవర్తనము విడిచినఁగాక
పరమేల కలుగు నాపదలేల మాను

(॥ఎంత॥)
వేంకటపతి నాత్మ వెదకినఁగాక
కింక మనసునఁ దొలఁగినఁగాక
బొంకుమాట లెడసిపోయినఁగాక
శంకయాల మాను జయమేల కలుగు

(||pallavi||)
ĕṁta sadivina nemi vinina tana-
siṁtayela mānu sirulela kalugu

(||ĕṁta||)
idara dūṣhaṇamulu yĕḍasinam̐gāga
adigāmugum̐ḍugāni yappuḍu gāga
madisaṁchalamu gŏṁta māninam̐gāga
gadi yela kalugu durgadulela mānu

(||ĕṁta||)
paradhanamulayāsa pāsinam̐gāga
aridiniṁdaluleniyappuḍu gāga
virasavardanamu viḍisinam̐gāga
paramela kalugu nābadalela mānu

(||ĕṁta||)
veṁkaḍabadi nātma vĕdaginam̐gāga
kiṁka manasunam̐ dŏlam̐ginam̐gāga
bŏṁkumāḍa lĕḍasiboyinam̐gāga
śhaṁkayāla mānu jayamela kalugu