ఎంత ఱట్టుసేసుకొనే విందుకుఁ గాను
(॥పల్లవి॥)
ఎంత ఱట్టుసేసుకొనే విందుకుఁ గాను
వింతలుగా నన్ను నెట్టు వేఁడుకొనేవు
(॥ఎంత॥)
అట్టె యాడనుండితేనే అలిగిన జాడలా
బెట్టిమాఁట లాడితేనే పెనుఁగోపమా
పొట్టఁ బొరుగున నుంటే పొంచులు వినుటలా
యిట్టు నట్టు వట్టి దూరు లేల దూరేవు
(॥ఎంత॥)
తప్పక చూచితేనే తగఁ జొప్పు వెదకుటా
నెప్పున నెందుంటివంటే నేరమెంచుటా
యిప్పుడు లోన నుండితే యెలయించిన చందమా
వుప్పతించి మమ్మునేల వోవలు సేసేవు
(॥ఎంత॥)
సెలవుల నవ్వితేను చేరి యెగసక్కెమా
కలువల వేసితేను కాఁతాళమా
అలమేలుమంగ నేను అట్టె శ్రీవేంకటేశ
యెలమి నన్నుఁ గూడితి వేల సాదించేవు
(||pallavi||)
ĕṁta ṟaṭṭusesugŏne viṁdugum̐ gānu
viṁtalugā nannu nĕṭṭu vem̐ḍugŏnevu
(||ĕṁta||)
aṭṭĕ yāḍanuṁḍidene aligina jāḍalā
bĕṭṭimām̐ṭa lāḍidene pĕnum̐gobamā
pŏṭṭam̐ bŏruguna nuṁṭe pŏṁchulu vinuḍalā
yiṭṭu naṭṭu vaṭṭi dūru lela dūrevu
(||ĕṁta||)
tappaga sūsidene tagam̐ jŏppu vĕdaguḍā
nĕppuna nĕṁduṁṭivaṁṭe neramĕṁchuḍā
yippuḍu lona nuṁḍide yĕlayiṁchina saṁdamā
vuppadiṁchi mammunela vovalu sesevu
(||ĕṁta||)
sĕlavula navvidenu seri yĕgasakkĕmā
kaluvala vesidenu kām̐tāḽamā
alamelumaṁga nenu aṭṭĕ śhrīveṁkaḍeśha
yĕlami nannum̐ gūḍidi vela sādiṁchevu