Emta rattu sesevu yemmegaamda

ఎంత రట్టు సేసేవు యెమ్మెకాఁడ
Language

(॥పల్లవి॥)
ఎంత రట్టు సేసేవు యెమ్మెకాఁడ
యింత బత్తి గలిగితేను యింటికి రావయ్యా

(॥ఎంత॥)
అందుకోలు వలపుల ఆసోదకాఁడ
విందుల మోవితేనెల వేడుకకాఁడ
సందడిసేసలు చల్లే జాజరకాఁడ
మందపట్టు మాఁటలేల మాయింటికి రావయ్యా

(॥ఎంత॥)
తరితీపు నవ్వుల దాయగాఁడ
విరుల వేట్లాడేటి వినోదకాఁడ
పెరరేపు సన్నల బేరగాఁడ
మరిగితే నేమాయ మా యింటికి రావయ్యా

(॥ఎంత॥)
నిక్కి నిక్కి చూపుల నేస్తకఁడ
మిక్కుటపుఁ బ్రియముల మేలగాఁడ
పక్కన నన్నేలినట్టి పంతగాఁడ
యెక్కువ శ్రీవేంకటేశ యింటికి రావయ్యా

(||pallavi||)
ĕṁta raṭṭu sesevu yĕmmĕgām̐ḍa
yiṁta batti galigidenu yiṁṭigi rāvayyā

(||ĕṁta||)
aṁdugolu valabula āsodagām̐ḍa
viṁdula movidenĕla veḍugagām̐ḍa
saṁdaḍisesalu salle jājaragām̐ḍa
maṁdabaṭṭu mām̐ṭalela māyiṁṭigi rāvayyā

(||ĕṁta||)
taridību navvula dāyagām̐ḍa
virula veṭlāḍeḍi vinodagām̐ḍa
pĕrarebu sannala beragām̐ḍa
marigide nemāya mā yiṁṭigi rāvayyā

(||ĕṁta||)
nikki nikki sūbula nestagam̐ḍa
mikkuḍabum̐ briyamula melagām̐ḍa
pakkana nannelinaṭṭi paṁtagām̐ḍa
yĕkkuva śhrīveṁkaḍeśha yiṁṭigi rāvayyā