Emta ṟattadidaname yemdu nerusugomtive

ఎంత ఱట్టడితనమే యెందు నేరుచుకొంటివే
Language

(॥పల్లవి॥)
ఎంత ఱట్టడితనమే యెందు నేరుచుకొంటివే
వింతలుగా నీతనికి వినోదాలు సేసేవు

(॥ఎంత॥)
కడలేనినవ్వులు గాదెఁ బెట్టుకుందానవా
గుడిగొనఁ బతివద్దఁ గుప్పవోసేవు
వొడికపుజాణతనా లొడిఁగట్టుకుందానవా
వెడ వెడగా సారె వెద చల్లేవు

(॥ఎంత॥)
మురిపెములల్లాను మూటగట్టుకుందానవా
పరిపరివిధములఁ బచరించేవు
గరిమలవలపులు గంపఁబెట్టుకుందానవా
అరిమురి నితనికి నమ్మవచ్చేవు

(॥ఎంత॥)
తొలుతే తరితీపులు దొంతిఁ బెట్టుకుందానవా
వెలయఁగ నితనికి విందువెట్టేవు
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
యెలమి నన్నేలె నీవూ నీవిభుఁగూడేవు

(||pallavi||)
ĕṁta ṟaṭṭaḍidaname yĕṁdu nerusugŏṁṭive
viṁtalugā nīdanigi vinodālu sesevu

(||ĕṁta||)
kaḍaleninavvulu gādĕm̐ bĕṭṭuguṁdānavā
guḍigŏnam̐ badivaddam̐ guppavosevu
vŏḍigabujāṇadanā lŏḍim̐gaṭṭuguṁdānavā
vĕḍa vĕḍagā sārĕ vĕda sallevu

(||ĕṁta||)
muribĕmulallānu mūḍagaṭṭuguṁdānavā
paribarividhamulam̐ basariṁchevu
garimalavalabulu gaṁpam̐bĕṭṭuguṁdānavā
arimuri nidanigi nammavachchevu

(||ĕṁta||)
tŏlude taridībulu dŏṁtim̐ bĕṭṭuguṁdānavā
vĕlayam̐ga nidanigi viṁduvĕṭṭevu
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
yĕlami nannelĕ nīvū nīvibhum̐gūḍevu