Emta raajasamu soobe veege yeduda

ఎంత రాజసము చూపే వీకె యెదుట
Language

(॥పల్లవి॥)
ఎంత రాజసము చూపే వీకె యెదుట
చెంతలనే మమ్మును చిమ్మి రేఁతురా

(॥ఎంత॥)
కొండలెక్కి నీకుఁ జనుఁగొండలు చూపీ మారు
గొండపై నుండిన నీకుఁ గోమలి
రెండుచేతులుఁ జాఁచి కూరిమి నందు కొనరాదా
అండనున్న లకిమమ్మ నలఇంతురా

(॥ఎంత॥)
పండుండి నీకు మోవిపండు చూపి యెలఇంచీ
పండువెన్నెలబయట పడఁతి
నిండునీవదనమున నక్కించి చేకొనరాదా
మెండైనలకిమమ్మతో మేకుసేతురా

(॥ఎంత॥)
కొనబుఁదనాన గోరికొన చూపీ పెండ్లిసేసు
కొనవవలెనని నీకుఁ గోమలి
యెనసితివి శ్రీవేంకటేశ నీ వౌభళేశుఁడ
ననరాదా లకిమమ్మ కటు మాటదాఁతురా

(||pallavi||)
ĕṁta rājasamu sūbe vīgĕ yĕduḍa
sĕṁtalane mammunu simmi rem̐turā

(||ĕṁta||)
kŏṁḍalĕkki nīgum̐ janum̐gŏṁḍalu sūbī māru
gŏṁḍabai nuṁḍina nīgum̐ gomali
rĕṁḍusedulum̐ jām̐si kūrimi naṁdu kŏnarādā
aṁḍanunna lagimamma nala̮iṁturā

(||ĕṁta||)
paṁḍuṁḍi nīgu movibaṁḍu sūbi yĕla̮iṁchī
paṁḍuvĕnnĕlabayaḍa paḍam̐ti
niṁḍunīvadanamuna nakkiṁchi segŏnarādā
mĕṁḍainalagimammado megusedurā

(||ĕṁta||)
kŏnabum̐danāna gorigŏna sūbī pĕṁḍlisesu
kŏnavavalĕnani nīgum̐ gomali
yĕnasidivi śhrīveṁkaḍeśha nī vaubhaḽeśhum̐ḍa
nanarādā lagimamma kaḍu māḍadām̐turā