Emta raajasabuvaamda vemi seppedi

ఎంత రాజసపువాఁడ వేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత రాజసపువాఁడ వేమి చెప్పేది
పంతములే యీ పెమీఁదఁ బచరించేవు

(॥ఎంత॥)
ఇందుముఖి ఆకుమడిచియ్యఁగా నీవిప్పుడు
అందుకొనక పరాకై వున్నాఁడవు
అందుకు నప్పటియాపె అట్టె చన్నుల నొత్తితే
సందడి సతులతోడ సరసమాడేవు

(॥ఎంత॥)
కప్పురపు లప్ప చెలి గక్కన నీకియ్యగాను
దప్పిదేరఁ జేకొనక తల వంచేవు
నెప్పున వాలారుగోళ్ళ నీగడ్డ మాపె యెత్తితే
దెప్పరాన వేరొకతె దిక్కు చూచేవు

(॥ఎంత॥)
వనిత తమ్ములము నీ వదనాన నీడఁగాను
మునుకొని అరవసమున నుండేవు
యెనసె శ్రీ వేంకటేశ యింతలోనే యాపె నిన్ను
చనవరి కాంతలకు సన్న సేసేవు

(||pallavi||)
ĕṁta rājasabuvām̐ḍa vemi sĕppedi
paṁtamule yī pĕmīm̐dam̐ basariṁchevu

(||ĕṁta||)
iṁdumukhi āgumaḍisiyyam̐gā nīvippuḍu
aṁdugŏnaga parāgai vunnām̐ḍavu
aṁdugu nappaḍiyābĕ aṭṭĕ sannula nŏttide
saṁdaḍi saduladoḍa sarasamāḍevu

(||ĕṁta||)
kappurabu lappa sĕli gakkana nīgiyyagānu
dappideram̐ jegŏnaga tala vaṁchevu
nĕppuna vālārugoḽḽa nīgaḍḍa mābĕ yĕttide
dĕpparāna verŏgadĕ dikku sūsevu

(||ĕṁta||)
vanida tammulamu nī vadanāna nīḍam̐gānu
munugŏni aravasamuna nuṁḍevu
yĕnasĕ śhrī veṁkaḍeśha yiṁtalone yābĕ ninnu
sanavari kāṁtalagu sanna sesevu