ఎంత రాతిమనసో నీకెప్పు డిఁకఁ గరఁగీనో
(॥పల్లవి॥)
ఎంత రాతిమనసో నీకెప్పు డిఁకఁ గరఁగీనో
పొంత సిగ్గువడీ నీతోఁ బొందేటి వేడుకను
(॥ఎంత॥)
కొప్పు వీడు తెఱఁగదు గు జారు టెఱఁగదు
తప్పక నిన్ను జూచీ దరుణి
దప్పిచేరీఁ బెదవుల తడఁబడీఁ దత్తరాన
అప్పనుండి మాటలాడీ నిబ్బరానను
(॥ఎంత॥)
చెలులనుఁ దలఁచదు చింత నిల్లు దలఁచదు
కొలువులు నీకుఁ జేసీ కొమలి
పులకలు మేన నించి పొంగుఁ జెమటల నీఁదీ
బలిమి నీతోఁ బెనఁగీ పంతపుటాసలను
(॥ఎంత॥)
వెస నలయికెంచదు వెనకముం దెంచదు
పొసఁగ నిన్నుఁ గూడుచుఁ బొలఁతి
యెసగ శ్రీవేంకటేశ యేపురేఁగి రతులను
పసగా సరసమాడీ బహుపరాకునను
(||pallavi||)
ĕṁta rādimanaso nīgĕppu ḍim̐kam̐ garam̐gīno
pŏṁta sigguvaḍī nīdom̐ bŏṁdeḍi veḍuganu
(||ĕṁta||)
kŏppu vīḍu tĕṟam̐gadu gu jāru ṭĕṟam̐gadu
tappaga ninnu jūsī daruṇi
dappiserīm̐ bĕdavula taḍam̐baḍīm̐ dattarāna
appanuṁḍi māḍalāḍī nibbarānanu
(||ĕṁta||)
sĕlulanum̐ dalam̐sadu siṁta nillu dalam̐sadu
kŏluvulu nīgum̐ jesī kŏmali
pulagalu mena niṁchi pŏṁgum̐ jĕmaḍala nīm̐dī
balimi nīdom̐ bĕnam̐gī paṁtabuḍāsalanu
(||ĕṁta||)
vĕsa nalayigĕṁchadu vĕnagamuṁ dĕṁchadu
pŏsam̐ga ninnum̐ gūḍusum̐ bŏlam̐ti
yĕsaga śhrīveṁkaḍeśha yeburem̐gi radulanu
pasagā sarasamāḍī bahubarāgunanu