ఎంత రాతిమనసే యింతిరో నీది
(॥పల్లవి॥)
ఎంత రాతిమనసే యింతిరో నీది
ఇంత నిన్ను వేఁడుకొనే దిది చూడవలదా
(॥ఎంత॥)
బత్తినేసి మాటడఁగాఁ బదరకువే పతితో
చిత్తగించి వినరాదా చెలియ నీవు
హత్తినిన్నుఁ బాసెనంటా నదె చూచేవుగాని
యెత్తినచేతుల మొక్కేటిది చూడవలదా
(॥ఎంత॥)
చనవిచ్చి నవ్వఁగాను జంకించకువే నీవు
కనువిచ్చి చూడరాదా ఘాతలేఁటికి
మునుపనే రాఁడంటా మొరఁగే చూచేవు గాని
యెనసి పంతమిచ్చిన దిది చూడవలదా
(॥ఎంత॥)
నిన్ను నిట్టె కూడఁగాను నివ్వెర గందకువే
మన్నించరాదా ఇఁక మచ్చికాయను
అన్నిటా శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
యెన్నికతోఁ గలసితి రిది చూడవలదా
(||pallavi||)
ĕṁta rādimanase yiṁtiro nīdi
iṁta ninnu vem̐ḍugŏne didi sūḍavaladā
(||ĕṁta||)
battinesi māḍaḍam̐gām̐ badaraguve padido
sittagiṁchi vinarādā sĕliya nīvu
hattininnum̐ bāsĕnaṁṭā nadĕ sūsevugāni
yĕttinasedula mŏkkeḍidi sūḍavaladā
(||ĕṁta||)
sanavichchi navvam̐gānu jaṁkiṁchaguve nīvu
kanuvichchi sūḍarādā ghādalem̐ṭigi
munubane rām̐ḍaṁṭā mŏram̐ge sūsevu gāni
yĕnasi paṁtamichchina didi sūḍavaladā
(||ĕṁta||)
ninnu niṭṭĕ kūḍam̐gānu nivvĕra gaṁdaguve
manniṁcharādā im̐ka machchigāyanu
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
yĕnnigadom̐ galasidi ridi sūḍavaladā