ఎంత పుణ్యమో నీకు హీనుని రక్షించితివి
(॥పల్లవి॥)
ఎంత పుణ్యమో నీకు హీనుని రక్షించితివి
యింత సేసితివి భాగ్య మేమి చెప్పీ నింకను
(॥ఎంత॥)
సరుగ నానోర నీవు సంకీర్తన విన్నపుడే
ఆరసి మోక్ష మిత్తువని నే నమ్మితి
పరుల బంటుఁగా జేయక యప్పటి నన్నేలి నపుడే
నరకమందుఁ బెట్టవు నమ్మితి నేను
(॥ఎంత॥)
కిమ్ముల నిఁక విన నీ కీర్తి గట్టినపుడె
నెమ్మి రక్షింతు వనుచు నే నమ్మితి
పమ్మి నా మదిలో నీ రూపము చూసినపుడే
క్రమ్మరఁ బుట్ట ననుచు గక్కన నే నమ్మితి
(॥ఎంత॥)
యిట్టె యోగక్షేమము వహించుకొని యున్నపుడె
నెట్టుకొనె నీ కృపని నే నమ్మితి
గట్టి శ్రీవేంకటేశ లోకదృష్టాంతమైనపుడే
వొట్టి సకలకర్మము లూడె నని నమ్మితి
(||pallavi||)
ĕṁta puṇyamo nīgu hīnuni rakṣhiṁchidivi
yiṁta sesidivi bhāgya memi sĕppī niṁkanu
(||ĕṁta||)
saruga nānora nīvu saṁkīrdana vinnabuḍe
ārasi mokṣha mittuvani ne nammidi
parula baṁṭum̐gā jeyaga yappaḍi nanneli nabuḍe
naragamaṁdum̐ bĕṭṭavu nammidi nenu
(||ĕṁta||)
kimmula nim̐ka vina nī kīrdi gaṭṭinabuḍĕ
nĕmmi rakṣhiṁtu vanusu ne nammidi
pammi nā madilo nī rūbamu sūsinabuḍe
krammaram̐ buṭṭa nanusu gakkana ne nammidi
(||ĕṁta||)
yiṭṭĕ yogakṣhemamu vahiṁchugŏni yunnabuḍĕ
nĕṭṭugŏnĕ nī kṛpani ne nammidi
gaṭṭi śhrīveṁkaḍeśha logadṛṣhṭāṁtamainabuḍe
vŏṭṭi sagalagarmamu lūḍĕ nani nammidi