Emta pogadevu nannu yemidigi baamti nenu

ఎంత పొగడేవు నన్ను యేమిటికి బాఁతి నేను
Language

(॥పల్లవి॥)
ఎంత పొగడేవు నన్ను యేమిటికి బాఁతి నేను
కాంతల నింత సేసితే గర్వము పెరుగదా

(॥ఎంత॥)
నడుమే సన్నముగాని నాకు నీతోఁబొందుసేసేఁ
యెడలేని యాసోద మెంతైనాఁ గద్దు
జడిగొన్న నాసిగ్గే చలియించకుండుఁగాని
వుడివోనితమకము లుఱ్ఱూఁత లూఁగును

(॥ఎంత॥)
మనసే మెత్తనగాని మరిగిన నీపైబత్తి
అనిశము సోదించితే నన్నిటా గట్టి
నినుఁ జూచేచూపులు నీలవర్ణములు గాని
ననుపైన సెలవుల నవ్వులు తెలుపులు

(॥ఎంత॥)
చెలరేఁగి నామోవిచిగురే వొగరు గాని
పలుకులు నీకైతే పచ్చి తేనెలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మొలకలు నాచన్నులు ముదురు వలపులు

(||pallavi||)
ĕṁta pŏgaḍevu nannu yemiḍigi bām̐ti nenu
kāṁtala niṁta seside garvamu pĕrugadā

(||ĕṁta||)
naḍume sannamugāni nāgu nīdom̐bŏṁdusesem̐
yĕḍaleni yāsoda mĕṁtainām̐ gaddu
jaḍigŏnna nāsigge saliyiṁchaguṁḍum̐gāni
vuḍivonidamagamu luṭrūm̐ta lūm̐gunu

(||ĕṁta||)
manase mĕttanagāni marigina nībaibatti
aniśhamu sodiṁchide nanniḍā gaṭṭi
ninum̐ jūsesūbulu nīlavarṇamulu gāni
nanubaina sĕlavula navvulu tĕlubulu

(||ĕṁta||)
sĕlarem̐gi nāmovisigure vŏgaru gāni
palugulu nīgaide pachchi tenĕlu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
mŏlagalu nāsannulu muduru valabulu