Emta pirigidaname yeme neevu

ఎంత పిరికితనమే యేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత పిరికితనమే యేమే నీవు
కాంతని కిచ్చకముగాఁ గాఁగిలించవలదా

(॥ఎంత॥)
పేని వట్టి విభునితో బిగిసే వెందాఁకనైనా
నానఁబెట్టేవు వలపు నవ్వుకొంటాను
మేను మేను సోఁకించక మేల మాతఁ డాడఁగాను
వెనముతో దగ్గరవు ముట్టుదానవటవే

(॥ఎంత॥)
సేసవెట్టి యీతనితో సిగ్గులు వచరించేవు
ఆసలఁ బెట్టేవు బొమ్మ లార్చుకొంటాను
ఆసపడి నీకు సన్న లట్టె సారెఁ జేసేవానిఁ
బాసి వుందానవు బల్లిపాటు దానవటవే

(॥ఎంత॥)
చేరి కాను కీవచ్చేవు చెలువునివద్దనుండి
నారువోసేవు చూపులు నాఁటుకొంటాను
యీరీతి శ్రీవేంకటేశుఁడేలె నన్ను నీవితనిఁ
బోరచిఁ గూడే వెంగిలిపొత్తుదానవటవే

(||pallavi||)
ĕṁta pirigidaname yeme nīvu
kāṁtani kichchagamugām̐ gām̐giliṁchavaladā

(||ĕṁta||)
peni vaṭṭi vibhunido bigise vĕṁdām̐kanainā
nānam̐bĕṭṭevu valabu navvugŏṁṭānu
menu menu som̐kiṁchaga mela mādam̐ ḍāḍam̐gānu
vĕnamudo daggaravu muṭṭudānavaḍave

(||ĕṁta||)
sesavĕṭṭi yīdanido siggulu vasariṁchevu
āsalam̐ bĕṭṭevu bŏmma lārsugŏṁṭānu
āsabaḍi nīgu sanna laṭṭĕ sārĕm̐ jesevānim̐
bāsi vuṁdānavu ballibāḍu dānavaḍave

(||ĕṁta||)
seri kānu kīvachchevu sĕluvunivaddanuṁḍi
nāruvosevu sūbulu nām̐ṭugŏṁṭānu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍelĕ nannu nīvidanim̐
borasim̐ gūḍe vĕṁgilibŏttudānavaḍave