ఎంత పెనఁగినా మానఁ డేమీ ననరాదు మాకు
(॥పల్లవి॥)
ఎంత పెనఁగినా మానఁ డేమీ ననరాదు మాకు
యింతటి మా ముంగురులు యివి చూడఁగదవే
(॥ఎంత॥)
ఆతనిఁ దోడుతెమ్మనే వంగనలము నేమైతే
కాతరీడాతఁడు మమ్ముఁ గాఁగిలించీనే
యీతల నేమెఱుఁగుదు మీ సుద్దులు వెనక కే
చేతుల మెడల నివే జీరలు చూడఁగదే
(॥ఎంత॥)
యేకతమాడి రమ్మనే వింతులము మొదలనే
కాతరి యాతఁడు చెనకక పోనీఁడే
కైకొని నాఁడే నేము కంటిమీగుణాలెల్లా
జోకలైన మోవిమీఁది సొమ్ములు చూడఁగదే
(॥ఎంత॥)
కానుకిచ్చి రమ్మంటివి కాంతల మమ్ముఁ జూచి
ఆనుక శ్రీవేంకటేశుఁ డట్టె కూడెనే
తానే మావెంట విచ్చేసి తగిలి నిన్నిదె యేలె
వూనిన మాచన్నులపై వొత్తులు చూడఁగదే
(||pallavi||)
ĕṁta pĕnam̐ginā mānam̐ ḍemī nanarādu māgu
yiṁtaḍi mā muṁgurulu yivi sūḍam̐gadave
(||ĕṁta||)
ādanim̐ doḍudĕmmane vaṁganalamu nemaide
kādarīḍādam̐ḍu mammum̐ gām̐giliṁchīne
yīdala nemĕṟum̐gudu mī suddulu vĕnaga ke
sedula mĕḍala nive jīralu sūḍam̐gade
(||ĕṁta||)
yegadamāḍi rammane viṁtulamu mŏdalane
kādari yādam̐ḍu sĕnagaka ponīm̐ḍe
kaigŏni nām̐ḍe nemu kaṁṭimīguṇālĕllā
jogalaina movimīm̐di sŏmmulu sūḍam̐gade
(||ĕṁta||)
kānugichchi rammaṁṭivi kāṁtala mammum̐ jūsi
ānuga śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ kūḍĕne
tāne māvĕṁṭa vichchesi tagili ninnidĕ yelĕ
vūnina māsannulabai vŏttulu sūḍam̐gade