Emta paramabamdhumdavu yemani nudimtu mimmu

ఎంత పరమబంధుఁడవు యేమని నుతింతు మిమ్ము
Language

(॥పల్లవి॥)
ఎంత పరమబంధుఁడవు యేమని నుతింతు మిమ్ము
అంత నిన్ను మఱచి నే నపరాధి నైతిని

(॥ఎంత॥)
దురితములే నేఁజేసి దుఁఖముఁబొందేనాఁడు
తొరలి నన్ను రోసి తొలఁగ వైతి
నరకము చోచ్చేనాఁడు నాకు నంతర్యామివై
పరుఁడు వీఁడేల యని పాయవైతివిగా

(॥ఎంత॥)
జనని గర్భమునందు చరిఁ బడి వుండేనాఁడు
వెనుబలమవై నన్ను విడువ వైతి
పెనఁగి పంచేంద్రియాల పిరువీఁకుల య్యెనాఁడు
అనుభవింపఁగఁ జేసి అందుకు లోనైతివి

(॥ఎంత॥)
యెట్టు నేఁగోరిన అది యిచ్చి పరతంత్రుఁడవై
మెట్టుకొని నా యిచ్చలో మెలఁగితివి
యిట్టి యీ జన్మమున నన్నేలి శ్రీవేంకటేశ
పట్టి నీ దాసులలోఁ దప్పక మన్నించితివి

(||pallavi||)
ĕṁta paramabaṁdhum̐ḍavu yemani nudiṁtu mimmu
aṁta ninnu maṟasi ne nabarādhi naidini

(||ĕṁta||)
duridamule nem̐jesi dum̐khamum̐bŏṁdenām̐ḍu
tŏrali nannu rosi tŏlam̐ga vaidi
naragamu sochchenām̐ḍu nāgu naṁtaryāmivai
parum̐ḍu vīm̐ḍela yani pāyavaidivigā

(||ĕṁta||)
janani garbhamunaṁdu sarim̐ baḍi vuṁḍenām̐ḍu
vĕnubalamavai nannu viḍuva vaidi
pĕnam̐gi paṁcheṁdriyāla piruvīm̐kula yyĕnām̐ḍu
anubhaviṁpam̐gam̐ jesi aṁdugu lonaidivi

(||ĕṁta||)
yĕṭṭu nem̐gorina adi yichchi paradaṁtrum̐ḍavai
mĕṭṭugŏni nā yichchalo mĕlam̐gidivi
yiṭṭi yī janmamuna nanneli śhrīveṁkaḍeśha
paṭṭi nī dāsulalom̐ dappaga manniṁchidivi