Emta paabajaadino yeṟamganaidi

ఎంత పాపజాతినో యెఱఁగనైతి
Language

(॥పల్లవి॥)
ఎంత పాపజాతినో యెఱఁగనైతి
చింతదీర నిన్నిటికి చేరి మొక్కేఁ జుమ్మీ

(॥ఎంత॥)
మొక్కలాన నీవద్ద ముసుఁగు వెట్టుకవుండి
పక్కనఁ బిలిచినాను పలుకనైతి
చెక్కునొక్కి నీవు నన్ను సేదలు దేర్చినాను
తెక్కులతో నేడలేని తిట్టులు దిట్టితిని

(॥ఎంత॥)
శిరసువట్టుక నీవు చేతులు చాఁచినాను
కురులంటకుమనుచు కోపగించితి
సరసమాడుచు నాతో చల్లఁగా నీవు నవ్వినా
అరగన్నుల జంకించి యానలు వెట్టితిని

(॥ఎంత॥)
వొడివట్టి తీసి నీవు వొడఁబరచినా నేను
విడుమని కాతరాన వేసారుకొంటి
అడరి శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁగూడితివి
తొడిఁబడ నిన్ను రతి దొమ్మి సేసితిని

(||pallavi||)
ĕṁta pābajādino yĕṟam̐ganaidi
siṁtadīra ninniḍigi seri mŏkkem̐ jummī

(||ĕṁta||)
mŏkkalāna nīvadda musum̐gu vĕṭṭugavuṁḍi
pakkanam̐ bilisinānu paluganaidi
sĕkkunŏkki nīvu nannu sedalu dersinānu
tĕkkulado neḍaleni tiṭṭulu diṭṭidini

(||ĕṁta||)
śhirasuvaṭṭuga nīvu sedulu sām̐sinānu
kurulaṁṭagumanusu kobagiṁchidi
sarasamāḍusu nādo sallam̐gā nīvu navvinā
aragannula jaṁkiṁchi yānalu vĕṭṭidini

(||ĕṁta||)
vŏḍivaṭṭi tīsi nīvu vŏḍam̐barasinā nenu
viḍumani kādarāna vesārugŏṁṭi
aḍari śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐gūḍidivi
tŏḍim̐baḍa ninnu radi dŏmmi sesidini