Emta nerusugonnadi yee vanida

ఎంత నేరుచుకొన్నది యీ వనిత
Language

(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొన్నది యీ వనిత
బంతి నీపె చేఁతలకు భ్రమయకుండుదురా

(॥ఎంత॥)
తొడమీఁదఁ గూచుండి తొయ్యలి నీమోము చూచి
కడుఁదేలగిలవేసీఁ గనుఁగొనలు
వొడివట్టుకొని నిన్ను వొయ్యారపుమాట లాడి
వెడరేఁచీ వలపులు ప్రియముతో నీకును

(॥ఎంత॥)
గుట్టున నీతో సొలసి గుబ్బలు నీపై సోఁకించి
ఱట్టడితనాన జఱసీ గోరను
అట్టె మోవి చూపి అరచేతఁ జెక్కునొక్కి
వొట్టియాసలు వుట్టించీవొద్దికతో నును

(॥ఎంత॥)
పయ్యద నీకుఁ గప్పి బలిమితోఁ గాఁగిలించి
వుయ్యాలమంచ మూఁచీ నుఱ్ఱూఁతలను
ఇయ్యెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
నెయ్యానఁ దా రతిసేసీ నేర్పులతో నీకును

(||pallavi||)
ĕṁta nerusugŏnnadi yī vanida
baṁti nībĕ sem̐talagu bhramayaguṁḍudurā

(||ĕṁta||)
tŏḍamīm̐dam̐ gūsuṁḍi tŏyyali nīmomu sūsi
kaḍum̐delagilavesīm̐ ganum̐gŏnalu
vŏḍivaṭṭugŏni ninnu vŏyyārabumāḍa lāḍi
vĕḍarem̐sī valabulu priyamudo nīgunu

(||ĕṁta||)
guṭṭuna nīdo sŏlasi gubbalu nībai som̐kiṁchi
ṟaṭṭaḍidanāna jaṟasī goranu
aṭṭĕ movi sūbi arasedam̐ jĕkkunŏkki
vŏṭṭiyāsalu vuṭṭiṁchīvŏddigado nunu

(||ĕṁta||)
payyada nīgum̐ gappi balimidom̐ gām̐giliṁchi
vuyyālamaṁcha mūm̐sī nuṭrūm̐talanu
iyyĕḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
nĕyyānam̐ dā radisesī nerbulado nīgunu