Emta nerusugonnadi yee sinnadi

ఎంత నేరుచుకొన్నది యీ చిన్నది
Language

(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొన్నది యీ చిన్నది
చెంత నుండే నిన్ను నిట్టె చేకొన్నది

(॥ఎంత॥)
చిగురుఁబెదవిమీఁదిచిన్నలూ
సగముమాటలతోడిసన్నలూ
నగియేటి పెలవులనయములూ
బిగిసేటికాఁగిటిప్రియములు

(॥ఎంత॥)
తనివోక చెలులతో తలపోఁతలూ
ననుపు లేపొద్దుమాననిచేఁతలు
పనివడి నీమీఁదిపాటలూ
మొనసి యెప్పుడు నీతో మొగమోటలు

(॥ఎంత॥)
వద్దనుండి పైఁజల్లీ వలపులు
అద్దుకొనీ రతిలోని యలపులు
వొద్దికై శ్రీవేంకటేశ వొనగూడితి వీకెను
కొద్దిమీరె బింకములు కూడినపొంకములు

(||pallavi||)
ĕṁta nerusugŏnnadi yī sinnadi
sĕṁta nuṁḍe ninnu niṭṭĕ segŏnnadi

(||ĕṁta||)
sigurum̐bĕdavimīm̐disinnalū
sagamumāḍaladoḍisannalū
nagiyeḍi pĕlavulanayamulū
bigiseḍigām̐giḍipriyamulu

(||ĕṁta||)
tanivoga sĕlulado talabom̐talū
nanubu lebŏddumānanisem̐talu
panivaḍi nīmīm̐dibāḍalū
mŏnasi yĕppuḍu nīdo mŏgamoḍalu

(||ĕṁta||)
vaddanuṁḍi paim̐jallī valabulu
addugŏnī radiloni yalabulu
vŏddigai śhrīveṁkaḍeśha vŏnagūḍidi vīgĕnu
kŏddimīrĕ biṁkamulu kūḍinabŏṁkamulu