ఎంత నేరుచుకొన్నాఁడే యీతఁడు తాను
(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొన్నాఁడే యీతఁడు తాను
సంతోసపు గుక్కిళ్లు చవిగొనీఁ దాను
(॥ఎంత॥)
కన్నులనాచూపు తన్నుఁ గాఁడిపారీనంటాను
వున్నతి నొడ్డించుకొనీ నూరకే తాను
చిన్నసెలవినవ్వులు చిమ్మిరేఁచీనంటాను
సన్నలనే బొమ్మలను జంకించీఁ దాను
(॥ఎంత॥)
నంటున నామాటలు నాములెక్కీనంటాను
గొంటరియై మంతరించుకొనీనే తాను
కంటగించి కొనగోరు కడువాఁడియంటాను
తుంటరితనాన జోడుదొడిగీనే తాను
(॥ఎంత॥)
వలుదచన్నులు రాలవంటివేయంటాను
వెలయఁగఁ గప్పురాన వేసీనే తాను
అలమి శ్రీవేంకటేశుఁడు డలమేలుమంగను నేను
వలపులకతలకు వన్నెవెట్టీఁ దాను
(||pallavi||)
ĕṁta nerusugŏnnām̐ḍe yīdam̐ḍu tānu
saṁtosabu gukkiḽlu savigŏnīm̐ dānu
(||ĕṁta||)
kannulanāsūbu tannum̐ gām̐ḍibārīnaṁṭānu
vunnadi nŏḍḍiṁchugŏnī nūrage tānu
sinnasĕlavinavvulu simmirem̐sīnaṁṭānu
sannalane bŏmmalanu jaṁkiṁchīm̐ dānu
(||ĕṁta||)
naṁṭuna nāmāḍalu nāmulĕkkīnaṁṭānu
gŏṁṭariyai maṁtariṁchugŏnīne tānu
kaṁṭagiṁchi kŏnagoru kaḍuvām̐ḍiyaṁṭānu
tuṁṭaridanāna joḍudŏḍigīne tānu
(||ĕṁta||)
valudasannulu rālavaṁṭiveyaṁṭānu
vĕlayam̐gam̐ gappurāna vesīne tānu
alami śhrīveṁkaḍeśhum̐ḍu ḍalamelumaṁganu nenu
valabulagadalagu vannĕvĕṭṭīm̐ dānu