ఎంత నేరుచుకొన్నాఁడే యీతఁడు
(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొన్నాఁడే యీతఁడు
సంతోసాలు రేఁచి మోవి చవిగొనీనితఁడు
(॥ఎంత॥)
కందువ నేనుండఁగానే కాఁగిలించుకొనీ ముందు
యెందరిఁ బొంది వచ్చెనో యీతఁడు
సందడించీ నూరివారి చన్నుల వాసనలెల్లా
అందాలుగా నాకుఁ జెప్పీ నడిగితే నితఁడు
(॥ఎంత॥)
పవ్వళించి వుండఁగాను పచ్చడము గప్పీఁ దొల్లి
యెవ్వరికిఁ గప్పినాఁడో యీతఁడు
నివ్వటిల్లీ జవ్వనుల నిండుమేని పసపులు
నవ్వీ నేనడిగితే నయముగా నితఁడు
(॥ఎంత॥)
పానుపుపై నుండఁగాను పసలుగా నన్నుఁ గూడె
యేనెలఁతల నేలెనో యీతఁడు
మేన నిండె గురుతులు మించి శ్రీవేంకటేశుఁడు
వీనులొగ్గీ నడిగితే వేమారుఁ దా నితఁడు
(||pallavi||)
ĕṁta nerusugŏnnām̐ḍe yīdam̐ḍu
saṁtosālu rem̐si movi savigŏnīnidam̐ḍu
(||ĕṁta||)
kaṁduva nenuṁḍam̐gāne kām̐giliṁchugŏnī muṁdu
yĕṁdarim̐ bŏṁdi vachchĕno yīdam̐ḍu
saṁdaḍiṁchī nūrivāri sannula vāsanalĕllā
aṁdālugā nāgum̐ jĕppī naḍigide nidam̐ḍu
(||ĕṁta||)
pavvaḽiṁchi vuṁḍam̐gānu pachchaḍamu gappīm̐ dŏlli
yĕvvarigim̐ gappinām̐ḍo yīdam̐ḍu
nivvaḍillī javvanula niṁḍumeni pasabulu
navvī nenaḍigide nayamugā nidam̐ḍu
(||ĕṁta||)
pānububai nuṁḍam̐gānu pasalugā nannum̐ gūḍĕ
yenĕlam̐tala nelĕno yīdam̐ḍu
mena niṁḍĕ gurudulu miṁchi śhrīveṁkaḍeśhum̐ḍu
vīnulŏggī naḍigide vemārum̐ dā nidam̐ḍu