Emta nerusugomtivi itte raamgaa raamgaa

ఎంత నేరుచుకొంటివి ఇట్టే రాఁగా రాఁగా
Language

(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొంటివి ఇట్టే రాఁగా రాఁగా
పంతగానివలె పై పై బిగిసేవు

(॥ఎంత॥)
కాదురా నామాట నీకుఁ గడుచెవులు చొరవా
యేదెసో చూచేవు నన్ను నేమీననవు
వాదులడిచి నిన్నిట్టె వలసినట్టు తిట్టఁగా
సాదుఁగొయ్య తనముతో సారెకు నవ్వేవు

(॥ఎంత॥)
యేలరా నేనింత నీకు యెగసక్కెపుదాననా
ఓలి దగ్గరఁ బిలిచి వూరకుండేవు
నీలాగు లెరిఁగియు నిన్నుఁ జేత దొబ్బినాను
గోలవలెనే వుండి కొంగు వట్టేవు

(॥ఎంత॥)
మేలురా నామాట నీకు మెచ్చఁ జోటు గలిగెనా
తాలిమితోనూఁకొంటాఁ దల వంచేవు
ఆలించి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యేలాటపువానివలెనిట్టె పెనఁగేవు

(||pallavi||)
ĕṁta nerusugŏṁṭivi iṭṭe rām̐gā rām̐gā
paṁtagānivalĕ pai pai bigisevu

(||ĕṁta||)
kādurā nāmāḍa nīgum̐ gaḍusĕvulu sŏravā
yedĕso sūsevu nannu nemīnanavu
vādulaḍisi ninniṭṭĕ valasinaṭṭu tiṭṭam̐gā
sādum̐gŏyya tanamudo sārĕgu navvevu

(||ĕṁta||)
yelarā neniṁta nīgu yĕgasakkĕbudānanā
oli daggaram̐ bilisi vūraguṁḍevu
nīlāgu lĕrim̐giyu ninnum̐ jeda dŏbbinānu
golavalĕne vuṁḍi kŏṁgu vaṭṭevu

(||ĕṁta||)
melurā nāmāḍa nīgu mĕchcham̐ joḍu galigĕnā
tālimidonūm̐kŏṁṭām̐ dala vaṁchevu
āliṁchi śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yelāḍabuvānivalĕniṭṭĕ pĕnam̐gevu