ఎంత నేరుచుకొంటివే యేతులు నీవు
(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొంటివే యేతులు నీవు
వింతలెల్లాఁ జూచి నాకు వెరగయ్యీ నిపుడు
(॥ఎంత॥)
వేడుకతో సారెసారె విన్నపాలు సేసేవు
వాడికగా నీ కతఁడు వలచునంటా
పాడి పాడి తానాలు పచారించి చూపేవు
జాడతో నాతఁడు మెచ్చి సంతోసించునంటాను
(॥ఎంత॥)
కడఁగి వద్దఁ గూచుండి కవకవ నవ్వేవు
యెడయ కాతఁడు చనవచ్చునంటాను
అడియాలముగ గోర నంటి యంటి చెనకేవు
కడు నాతఁడు మరిగి కైకొనునంటాను
(॥ఎంత॥)
చన్ను లొరసుకొంటాను సరుసఁ గొప్పు దువ్వేవు
నిన్ను నతఁడు కాఁగిటను నించునంటాను
ఇన్నిటాను శ్రీవేంకటేశుఁడు నన్నేలినాఁడు
సన్నసేసే వాతఁడు సమ్మతించునంటాను
(||pallavi||)
ĕṁta nerusugŏṁṭive yedulu nīvu
viṁtalĕllām̐ jūsi nāgu vĕragayyī nibuḍu
(||ĕṁta||)
veḍugado sārĕsārĕ vinnabālu sesevu
vāḍigagā nī kadam̐ḍu valasunaṁṭā
pāḍi pāḍi tānālu pasāriṁchi sūbevu
jāḍado nādam̐ḍu mĕchchi saṁtosiṁchunaṁṭānu
(||ĕṁta||)
kaḍam̐gi vaddam̐ gūsuṁḍi kavagava navvevu
yĕḍaya kādam̐ḍu sanavachchunaṁṭānu
aḍiyālamuga gora naṁṭi yaṁṭi sĕnagevu
kaḍu nādam̐ḍu marigi kaigŏnunaṁṭānu
(||ĕṁta||)
sannu lŏrasugŏṁṭānu sarusam̐ gŏppu duvvevu
ninnu nadam̐ḍu kām̐giḍanu niṁchunaṁṭānu
inniḍānu śhrīveṁkaḍeśhum̐ḍu nannelinām̐ḍu
sannasese vādam̐ḍu sammadiṁchunaṁṭānu