ఎంత నేరుపరి యిది యెక్కడఁ గలిగె నీకు
(॥పల్లవి॥)
ఎంత నేరుపరి యిది యెక్కడఁ గలిగె నీకు
వింతలివి యల్లాఁ జూఁచి వెరగయ్యీ మాకు
(॥ఎంత॥)
ముక్కర గదలఁగాను ముసిముసినవ్వులు నవ్వీ
చొక్కపునీదేవులనుఁ జూడవయ్యా
పుక్కిటివిడెముతోడ పూఁచిపూఁచి మాటలాడీ
చెక్కులచెమట గోరఁ జిమ్ముకొంటాను
(॥ఎంత॥)
తళుకుఁగన్నులు మించ తలయెత్తి నినుఁ జూచీ
సొలపులజవరాలిఁ జూడవయ్యా
వలిపెపయ్యద గప్పి వరుసఁ గొలువుసేసీ
చెలఁగి జూరుఁదురుము చెక్కుకొంటాను
(॥ఎంత॥)
కంకణాలుమొరయఁగ కప్పురవిడె మిచ్చీని
సుంకుఁదరితీపు లాఁడీఁ జూడవయ్యా
అంకెల శ్రీవేంకటేశ యన్నిటా నిన్నీకె గూడె
పొంకమైననిన్ను నన్నుఁ బొగడుకొంటాను
(||pallavi||)
ĕṁta nerubari yidi yĕkkaḍam̐ galigĕ nīgu
viṁtalivi yallām̐ jūm̐si vĕragayyī māgu
(||ĕṁta||)
mukkara gadalam̐gānu musimusinavvulu navvī
sŏkkabunīdevulanum̐ jūḍavayyā
pukkiḍiviḍĕmudoḍa pūm̐sibūm̐si māḍalāḍī
sĕkkulasĕmaḍa goram̐ jimmugŏṁṭānu
(||ĕṁta||)
taḽugum̐gannulu miṁcha talayĕtti ninum̐ jūsī
sŏlabulajavarālim̐ jūḍavayyā
valibĕbayyada gappi varusam̐ gŏluvusesī
sĕlam̐gi jūrum̐durumu sĕkkugŏṁṭānu
(||ĕṁta||)
kaṁkaṇālumŏrayam̐ga kappuraviḍĕ michchīni
suṁkum̐daridību lām̐ḍīm̐ jūḍavayyā
aṁkĕla śhrīveṁkaḍeśha yanniḍā ninnīgĕ gūḍĕ
pŏṁkamainaninnu nannum̐ bŏgaḍugŏṁṭānu