Emta nerubari yeege yeduvamti kaligi

ఎంత నేరుపరి యీకె యెటువంటి కలికి
Language

(॥పల్లవి॥)
ఎంత నేరుపరి యీకె యెటువంటి కలికి
మంతనాన నెటువలె మన్నించేవే ఇఁకను

(॥ఎంత॥)
పొరుగు పోరచిగాను పొలఁతి నీతోడుత
సరసము లాడి యాడి చవిరేఁచెను
తెరలోనికి రమ్మని తెలియ సన్నలుగాను
విరులను వేసి వేసి వేడుక వుట్టించెను

(॥ఎంత॥)
వాడికపొందులు తాను వనిత తేనియలూర
వాడుమోవి చూపి చూపి వలపించెను
వాడలో జక్కఁదనము వడిఁదనకే కద్దని
గోడ నిక్కి చూచి చూచి కోరికవుట్టించెను

(॥ఎంత॥)
చల్లు వెదలుగా నీతో సారెకు నలమేల్మంగ
మొల్లమిగా నవ్వి నవ్వి మోహింపించెను
వెల్లవిరిగా నిట్టె శ్రీవేంకటేశ కూడితివి
యెల్లచోటా మెచ్చి మెచ్చి యింపులు వుట్టించెను

(||pallavi||)
ĕṁta nerubari yīgĕ yĕḍuvaṁṭi kaligi
maṁtanāna nĕḍuvalĕ manniṁcheve im̐kanu

(||ĕṁta||)
pŏrugu porasigānu pŏlam̐ti nīdoḍuda
sarasamu lāḍi yāḍi savirem̐sĕnu
tĕralonigi rammani tĕliya sannalugānu
virulanu vesi vesi veḍuga vuṭṭiṁchĕnu

(||ĕṁta||)
vāḍigabŏṁdulu tānu vanida teniyalūra
vāḍumovi sūbi sūbi valabiṁchĕnu
vāḍalo jakkam̐danamu vaḍim̐danage kaddani
goḍa nikki sūsi sūsi korigavuṭṭiṁchĕnu

(||ĕṁta||)
sallu vĕdalugā nīdo sārĕgu nalamelmaṁga
mŏllamigā navvi navvi mohiṁpiṁchĕnu
vĕllavirigā niṭṭĕ śhrīveṁkaḍeśha kūḍidivi
yĕllasoḍā mĕchchi mĕchchi yiṁpulu vuṭṭiṁchĕnu