ఎంత నేరుపరి యీపె నేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఎంత నేరుపరి యీపె నేమి చెప్పేది
కాంతకు నీకు వలపు గాడిఁ గట్టీని
(॥ఎంత॥)
కొమ్మా నీవు గూచుండఁగా కొంగులు ముళ్ళవేసీ
నెమ్మది నీకె చేయి వట్టి నిన్ను దీసీని
దొమ్మి నాకె వెంట వచ్చి తోడఁ బెండ్లికూతురై
చిమ్మి రేఁగి లోలోఁ దానే సిగ్గులు వడీని
(॥ఎంత॥)
చదరంగ మాడఁగాను జంటగా జిగు రంటించి
కదిమి తెరలోనికిఁ బద మనీని
సుదతి వెంటనే వచ్చి సూదివెంట దారమై
అదివో నివ్వెఱఁగంది అట్టే నవ్వీని
(॥ఎంత॥)
కైదండ యియ్యఁగా మొలక ట్టిద్దరిఁ దగిలించి
ఆదిగొని తన్నుఁ గూడుమని వట్టీని
పోదితో శ్రీవేంకటేశ పొలఁతితోడినీడయై
యీదె నన్నేలుటకు నిచ్చక మాడీని
(||pallavi||)
ĕṁta nerubari yībĕ nemi sĕppedi
kāṁtagu nīgu valabu gāḍim̐ gaṭṭīni
(||ĕṁta||)
kŏmmā nīvu gūsuṁḍam̐gā kŏṁgulu muḽḽavesī
nĕmmadi nīgĕ seyi vaṭṭi ninnu dīsīni
dŏmmi nāgĕ vĕṁṭa vachchi toḍam̐ bĕṁḍligūdurai
simmi rem̐gi lolom̐ dāne siggulu vaḍīni
(||ĕṁta||)
sadaraṁga māḍam̐gānu jaṁṭagā jigu raṁṭiṁchi
kadimi tĕralonigim̐ bada manīni
sudadi vĕṁṭane vachchi sūdivĕṁṭa dāramai
adivo nivvĕṟam̐gaṁdi aṭṭe navvīni
(||ĕṁta||)
kaidaṁḍa yiyyam̐gā mŏlaga ṭṭiddarim̐ dagiliṁchi
ādigŏni tannum̐ gūḍumani vaṭṭīni
podido śhrīveṁkaḍeśha pŏlam̐tidoḍinīḍayai
yīdĕ nanneluḍagu nichchaga māḍīni