Emta nersene yee maguvaa

ఎంత నేర్చెనే యీ మగువా
Language

(॥పల్లవి॥)
ఎంత నేర్చెనే యీ మగువా
పంతమె నెరసీఁ బాయముమీఁదా

(॥ఎంత॥)
చుక్కలపొడవగు సుదతిచన్నుఁగన
జక్కన లెగరుచు జరయఁగను
గక్కన కిన్నెరకాయగూండ్లఁ
దొక్కిపట్టి తంత్రులుమీఁటీని

(॥ఎంత॥)
గుట్టున నుండక కొప్పుతుమ్మిదల -
తెట్టెలు చెదరఁగఁ దెరవ యిదె
కట్టిడిగోళ్లకత్తులబోనునఁ
బెట్టుచు శ్రుతులే బిగిఇంచీని

(॥ఎంత॥)
యిత్తరి శ్రీవేంకటేశ్వరుఁ గూడఁగఁ
గుత్తికలోపలికోవిల లా-
బిత్తరియధరపుఁ బిల్లఁగోవిలో -
నొత్తి నిలిపి తనివొందించీని

(||pallavi||)
ĕṁta nersĕne yī maguvā
paṁtamĕ nĕrasīm̐ bāyamumīm̐dā

(||ĕṁta||)
sukkalabŏḍavagu sudadisannum̐gana
jakkana lĕgarusu jarayam̐ganu
gakkana kinnĕragāyagūṁḍlam̐
dŏkkibaṭṭi taṁtrulumīm̐ṭīni

(||ĕṁta||)
guṭṭuna nuṁḍaga kŏppudummidala -
tĕṭṭĕlu sĕdaram̐gam̐ dĕrava yidĕ
kaṭṭiḍigoḽlagattulabonunam̐
bĕṭṭusu śhrudule bigiiṁchīni

(||ĕṁta||)
yittari śhrīveṁkaḍeśhvarum̐ gūḍam̐gam̐
guttigalobaligovila lā-
bittariyadharabum̐ billam̐govilo -
nŏtti nilibi tanivŏṁdiṁchīni