ఎంత నీవు పోతరించి యింపులఁ బెనఁగినాను
(॥పల్లవి॥)
ఎంత నీవు పోతరించి యింపులఁ బెనఁగినాను
వంతుకుఁ గొంగువట్టితి వదలకు మనవే
(॥॥)
కాతరించి రమణునిఁ గలకాలమెల్లా నీవే
చేతఁ జొక్కించుకొంటివి చెప్పేదేమే
యీతల నాతడే మాయింటికి విచ్చేసె నేఁడు
నీతితోడ నిలువక నేనేల విడుతునే
(॥॥)
బలిమితో మగవాని బాసలు చేయించుకొని
యెలయించి కై కొంటివి ఇంకానేమే
వలపించి యాతని నా వద్దికి రప్పించుకొంటి
వెలయ భోగించక నీ వెంట నేలంపుదునే
(॥॥)
కందువ శ్రీ వేంకటేశఁ గాఁగిటిరతులఁగూడి
అందరిలో మెరసితి వప్పటినేమే
ముందుముందె నే నాతనిమోవితేనె దక్కఁగొంటి
అందముగఁ బెండ్లాడక అదేల మానుదునే
(||pallavi||)
ĕṁta nīvu podariṁchi yiṁpulam̐ bĕnam̐ginānu
vaṁtugum̐ gŏṁguvaṭṭidi vadalagu manave
(||||)
kādariṁchi ramaṇunim̐ galagālamĕllā nīve
sedam̐ jŏkkiṁchugŏṁṭivi sĕppedeme
yīdala nādaḍe māyiṁṭigi vichchesĕ nem̐ḍu
nīdidoḍa niluvaga nenela viḍudune
(||||)
balimido magavāni bāsalu seyiṁchugŏni
yĕlayiṁchi kai kŏṁṭivi iṁkāneme
valabiṁchi yādani nā vaddigi rappiṁchugŏṁṭi
vĕlaya bhogiṁchaga nī vĕṁṭa nelaṁpudune
(||||)
kaṁduva śhrī veṁkaḍeśham̐ gām̐giḍiradulam̐gūḍi
aṁdarilo mĕrasidi vappaḍineme
muṁdumuṁdĕ ne nādanimovidenĕ dakkam̐gŏṁṭi
aṁdamugam̐ bĕṁḍlāḍaga adela mānudune