Emta neevu padivainaa yimtulagu lone summee

ఎంత నీవు పతివైనా యింతులకు లోనే సుమ్మీ
Language

(॥పల్లవి॥)
ఎంత నీవు పతివైనా యింతులకు లోనే సుమ్మీ
వంత జవ్వనమదపువారు సుమ్మీ వీరు

(॥ఎంత॥)
సొలసి యాడెటిమాట సుమాళముమీఁది పాట
పెలుచుఁగామినులకుఁ బెట్టని కోటా
బలిమి చూపఁగ రాదు పంతపు మగవారికి
వలరాచసలిగెలవారు సుమ్మీ వీరు

(॥ఎంత॥)
కనుచూపుల కొసరు గబ్బితనపుటుసురు
దినవలపులకు నెత్తినయసరు
మొనలు మీరఁగ రాదు ముంచి యెంతకొర తైన
వనవసంతునిపౌజువారు సుమ్మీ వీరు

(॥ఎంత॥)
వుదుటుమీఁది సణఁగు వొద్దికతోడి గొణఁగు
మదరాగ మీసతికి మంచి మణుఁగు
ఆదన శ్రీవెంకటేశ అట్టె కూడితి వీపెను
వదనశశినిఁ బోలేవారు సుమ్మీ వీరు

(||pallavi||)
ĕṁta nīvu padivainā yiṁtulagu lone summī
vaṁta javvanamadabuvāru summī vīru

(||ĕṁta||)
sŏlasi yāḍĕḍimāḍa sumāḽamumīm̐di pāḍa
pĕlusum̐gāminulagum̐ bĕṭṭani koḍā
balimi sūbam̐ga rādu paṁtabu magavārigi
valarāsasaligĕlavāru summī vīru

(||ĕṁta||)
kanusūbula kŏsaru gabbidanabuḍusuru
dinavalabulagu nĕttinayasaru
mŏnalu mīram̐ga rādu muṁchi yĕṁtagŏra taina
vanavasaṁtunibaujuvāru summī vīru

(||ĕṁta||)
vuduḍumīm̐di saṇam̐gu vŏddigadoḍi gŏṇam̐gu
madarāga mīsadigi maṁchi maṇum̐gu
ādana śhrīvĕṁkaḍeśha aṭṭĕ kūḍidi vībĕnu
vadanaśhaśhinim̐ bolevāru summī vīru