Emta nee yaasodamu yemi seppedi

ఎంత నీ యాసోదము యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత నీ యాసోదము యేమి చెప్పేది
చెంతలనే వేడుకలు చిమ్మి రేఁచవలెనా

(॥ఎంత॥)
కలువలఁ బోలేటి కన్నులను నినుఁ జూచి
వలపులు వెంచీని వద్ద నీకాపె
కలయుమనుచు నన్నుఁ గాఁగిలించ వచ్చేవు
నలువంక వలపులు నారువోయవలెనా

(॥ఎంత॥)
పెనఁగులాటల నీతోఁ బ్రేమములు చూపి మోపి
ననుపులు సేసీని నంటున నాకె
చెనకులనే నాపైఁ జేతులు చాఁచే వప్పటి
మొనసి తమకములు మోపు గట్టవలెనా

(॥ఎంత॥)
మించిన రతుల నిట్టే మేలములాడి యాడి
వంచనతోఁ గూడీని వైపుగా నాపె
అంచల శ్రీవేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
పెంచేవుఁ గోరికలింత పేరఁబెట్టవలెనా

(||pallavi||)
ĕṁta nī yāsodamu yemi sĕppedi
sĕṁtalane veḍugalu simmi rem̐savalĕnā

(||ĕṁta||)
kaluvalam̐ boleḍi kannulanu ninum̐ jūsi
valabulu vĕṁchīni vadda nīgābĕ
kalayumanusu nannum̐ gām̐giliṁcha vachchevu
naluvaṁka valabulu nāruvoyavalĕnā

(||ĕṁta||)
pĕnam̐gulāḍala nīdom̐ bremamulu sūbi mobi
nanubulu sesīni naṁṭuna nāgĕ
sĕnagulane nābaim̐ jedulu sām̐se vappaḍi
mŏnasi tamagamulu mobu gaṭṭavalĕnā

(||ĕṁta||)
miṁchina radula niṭṭe melamulāḍi yāḍi
vaṁchanadom̐ gūḍīni vaibugā nābĕ
aṁchala śhrīveṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
pĕṁchevum̐ gorigaliṁta peram̐bĕṭṭavalĕnā