ఎంత నన్నుఁ బొగడేవు యిందరిలోన
(॥పల్లవి॥)
ఎంత నన్నుఁ బొగడేవు యిందరిలోన
సంతతవు వెూహములు చల్లఁగలఁ గాక
(॥॥)
నిన్ను మెప్పించఁగ నేను నేరుతునా యేమైనాను
కన్నులనే మొక్కనేర్తుఁగాక నీకు
సన్నలుసేసి వట్టియాసల ముంచఁగలనా
చిన్నదాననై సేవలు సేయఁగలఁగాక
(॥॥)
సరసములాడి నీతో సాటికి రానోపుదునా
వొరసి యిచ్చకమాడ నోపుదుఁగాక
తరితీపు చూపి కొత్తలు సేయఁగలవా
పెరరేఁచి కోరికలే పెంచఁగలఁగాక
(॥॥)
మించి నీకంటె పంతాన మెరసేటిదాననా
పొంచి మేనదాననై భోగింతుఁగాక
అంచెల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యెంచఁగలనారతులు నించఁగలఁగాక
(||pallavi||)
ĕṁta nannum̐ bŏgaḍevu yiṁdarilona
saṁtadavu vĕూhamulu sallam̐galam̐ gāga
(||||)
ninnu mĕppiṁcham̐ga nenu nerudunā yemainānu
kannulane mŏkkanerdum̐gāga nīgu
sannalusesi vaṭṭiyāsala muṁcham̐galanā
sinnadānanai sevalu seyam̐galam̐gāga
(||||)
sarasamulāḍi nīdo sāḍigi rānobudunā
vŏrasi yichchagamāḍa nobudum̐gāga
taridību sūbi kŏttalu seyam̐galavā
pĕrarem̐si korigale pĕṁcham̐galam̐gāga
(||||)
miṁchi nīgaṁṭĕ paṁtāna mĕraseḍidānanā
pŏṁchi menadānanai bhogiṁtum̐gāga
aṁchĕla śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yĕṁcham̐galanāradulu niṁcham̐galam̐gāga