ఎంత నన్ను వేఁడుకొనే విందుకుఁగాను
(॥పల్లవి॥)
ఎంత నన్ను వేఁడుకొనే విందుకుఁగాను
సంతోసాన నీచేఁతలు సమ్మతింతుఁగాక
(॥ఎంత॥)
యేసతితో మాటాడినా నెగ్గువట్టే దాననా
ఆసతో నీకిచ్చకమే అడుదుఁగాక
వాసు లాపె కెక్కించితే వద్దనేటిదానగా
సేసవెట్టి నీచలము చెల్లింతుఁగాక
(॥ఎంత॥)
కడదానితో నవ్వితేఁ గాదనేటిదాననా
యెడమిచ్చి నీవేడుక యీడేర్తుఁగాక
తొడఁమీదఁ బెట్టుకుంటే దూరేటిదాననా
పిడికిటివిడేలిచ్చి ప్రేమ రేఁతుఁగాక
(॥ఎంత॥)
చెలికత్తేఁ జెనకితే చేరి జంకించేదాననా
సెలవిచ్చి నీకరుణ చేకొందుఁగాక
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
అలమితి విటు నన్ను నానందించేఁగాక
(||pallavi||)
ĕṁta nannu vem̐ḍugŏne viṁdugum̐gānu
saṁtosāna nīsem̐talu sammadiṁtum̐gāga
(||ĕṁta||)
yesadido māḍāḍinā nĕgguvaṭṭe dānanā
āsado nīgichchagame aḍudum̐gāga
vāsu lābĕ kĕkkiṁchide vaddaneḍidānagā
sesavĕṭṭi nīsalamu sĕlliṁtum̐gāga
(||ĕṁta||)
kaḍadānido navvidem̐ gādaneḍidānanā
yĕḍamichchi nīveḍuga yīḍerdum̐gāga
tŏḍam̐mīdam̐ bĕṭṭuguṁṭe dūreḍidānanā
piḍigiḍiviḍelichchi prema rem̐tum̐gāga
(||ĕṁta||)
sĕligattem̐ jĕnagide seri jaṁkiṁchedānanā
sĕlavichchi nīgaruṇa segŏṁdum̐gāga
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
alamidi viḍu nannu nānaṁdiṁchem̐gāga