ఎంత నమ్మనిదానవు యేమే నీవు
(॥పల్లవి॥)
ఎంత నమ్మనిదానవు యేమే నీవు
చింతతోఁ బగచాటేవు చెల్లఁబో నీవు
(॥॥)
జమళిమోహాలు మనసరుసనే వుండఁగాను
తమకించి మాటలాడఁ దగవా నీవు
చెమటకాఁగిలి మనచేతులలో నుండఁగాను
అమరనివెంగెమాడే వౌనే నీవు
(॥॥)
నూఁటినమోవులు మననోళ్ళలో నుండఁగాను
యేఁటిఁకిఁ గొసరఁ జొచ్చే వేమే నీవు
కూటములు చెక్కులపై గుఱుతులై వుండఁగాను
పాటించి యేడవోయంటా భ్రమసేవే నీవు
(॥॥)
బచ్చనరతులు మనపానుపుపై నుండఁగాను
ఇచ్చగించి మఱచేవు యేమే నీవు
పచ్చిగా శ్రీ వేంకటాద్రినతి నేఁగూడితి నిన్ను
మెచ్చితి మొకరొకరి మేలే నీవు
(||pallavi||)
ĕṁta nammanidānavu yeme nīvu
siṁtadom̐ bagasāḍevu sĕllam̐bo nīvu
(||||)
jamaḽimohālu manasarusane vuṁḍam̐gānu
tamagiṁchi māḍalāḍam̐ dagavā nīvu
sĕmaḍagām̐gili manasedulalo nuṁḍam̐gānu
amaranivĕṁgĕmāḍe vaune nīvu
(||||)
nūm̐ṭinamovulu mananoḽḽalo nuṁḍam̐gānu
yem̐ṭim̐kim̐ gŏsaram̐ jŏchche veme nīvu
kūḍamulu sĕkkulabai guṟudulai vuṁḍam̐gānu
pāḍiṁchi yeḍavoyaṁṭā bhramaseve nīvu
(||||)
bachchanaradulu manabānububai nuṁḍam̐gānu
ichchagiṁchi maṟasevu yeme nīvu
pachchigā śhrī veṁkaḍādrinadi nem̐gūḍidi ninnu
mĕchchidi mŏgarŏgari mele nīvu