ఎంత నాకుఁ జనవిచ్చి యియ్యకొనీనే తాను
(॥పల్లవి॥)
ఎంత నాకుఁ జనవిచ్చి యియ్యకొనీనే తాను
మంతనాన యిట్టె నన్ను మన్నించీఁ గాక
(॥ఎంత॥)
మనసులు సోదించి మాఁటలాడేదాననా
తనయిచ్చలో మెలఁగేదానఁ గాక
కొనచూపులనుఁ జూచి కొసరేలిదాననా
వినయాన వేఁడుకొని వెలసేదానఁ గాక
(॥ఎంత॥)
నాలిఁ బెట్టి తనతో నే నవ్వేటిదాననా
తాలిమితో సేవ సేసేదానఁ గాక
చాలుకొని బొమ్మలను జంకించేటిదాననా
మేలుమీఁదిదాననై మెచ్చేటిదానఁ గాక
(॥ఎంత॥)
యిమ్ములఁ దనకు విడె మిచ్చేటిదాననా
తమ్ములము తన్నడిగేదానఁ గాక
నెమ్మది శ్రీవేంకటాద్రినిలయుఁడు నన్నుఁ గూడె
చిమ్మిరేఁచేదాననా చేతిలోదానఁ గాక
(||pallavi||)
ĕṁta nāgum̐ janavichchi yiyyagŏnīne tānu
maṁtanāna yiṭṭĕ nannu manniṁchīm̐ gāga
(||ĕṁta||)
manasulu sodiṁchi mām̐ṭalāḍedānanā
tanayichchalo mĕlam̐gedānam̐ gāga
kŏnasūbulanum̐ jūsi kŏsarelidānanā
vinayāna vem̐ḍugŏni vĕlasedānam̐ gāga
(||ĕṁta||)
nālim̐ bĕṭṭi tanado ne navveḍidānanā
tālimido seva sesedānam̐ gāga
sālugŏni bŏmmalanu jaṁkiṁcheḍidānanā
melumīm̐didānanai mĕchcheḍidānam̐ gāga
(||ĕṁta||)
yimmulam̐ danagu viḍĕ michcheḍidānanā
tammulamu tannaḍigedānam̐ gāga
nĕmmadi śhrīveṁkaḍādrinilayum̐ḍu nannum̐ gūḍĕ
simmirem̐sedānanā sedilodānam̐ gāga