ఎంత నా సుద్దులు చెప్పీ నిందరితోను
(॥పల్లవి॥)
ఎంత నా సుద్దులు చెప్పీ నిందరితోను
కొంతైనా తన పాదపుగోరఁ బోలఁగలనా
(॥ఎంత॥)
తనమన్ననే నాచక్కఁతనముగలఫలము
సనివినతనపొందే నాభాగ్యము
పెనఁగేటితనరతిపెంపే నాసంపద
యని చెప్పరే చెలులు యతనితోను
(॥ఎంత॥)
కరుణించి తాఁజూచుటేకలది నాసింగారము
సరుగఁ దాఁబై కొనుటే సామ్రాజ్యము
పరగఁదా మెచ్చుటే నాపాయపు గరగరిక
గరిమఁ దెలుపరే యీకతలు విభునికి
(॥ఎంత॥)
కొలువులోఁదా నవ్వుటే గుట్టు నాపెద్దరికము
కలసేతనకాఁగిలే కాణాచిమేలు
యెలమి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నునేలె
చెలఁగి యీ విన్నపము సేయరే తనకు
(||pallavi||)
ĕṁta nā suddulu sĕppī niṁdaridonu
kŏṁtainā tana pādabugoram̐ bolam̐galanā
(||ĕṁta||)
tanamannane nāsakkam̐tanamugalaphalamu
sanivinadanabŏṁde nābhāgyamu
pĕnam̐geḍidanaradibĕṁpe nāsaṁpada
yani sĕppare sĕlulu yadanidonu
(||ĕṁta||)
karuṇiṁchi tām̐jūsuḍegaladi nāsiṁgāramu
sarugam̐ dām̐bai kŏnuḍe sāmrājyamu
paragam̐dā mĕchchuḍe nābāyabu garagariga
garimam̐ dĕlubare yīgadalu vibhunigi
(||ĕṁta||)
kŏluvulom̐dā navvuḍe guṭṭu nābĕddarigamu
kalasedanagām̐gile kāṇāsimelu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannunelĕ
sĕlam̐gi yī vinnabamu seyare tanagu